ఉజ్వల పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గ్యాస్ కనెక్షన్ సద్వినియోగం చేసుకోండి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
వినియోగదారుల నుండి అధిక ధరలు అదనపు చార్జీలు వసూలు చేసే వారిపై చర్యలు తప్పవు
ఉజ్వల పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గ్యాస్ కనెక్షన్ అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం ఆకివీడు ఓంజేఎన్టి హెచ్.పి గ్యాస్ డీలర్ వద్ద ఉజ్వల పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ కంపెనీ లు, ఇచ్చే ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకంలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా 50 మంది అర్హులైన లబ్ధిదారులకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ లను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన మహిళలకు స్వచ్ఛమైన ఎల్పిజి గ్యాస్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం కింద ఉచితంగా సిలిండర్, స్టవ్, మొదటి రీఫిల్ అందజేస్తారని అన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం పేద కుటుంబాల్లోని మహిళలకు పొగలేని వంటగదిని అందించడం కట్టెలు బొగ్గులపై ఆధారపడటాన్ని తగ్గించటం కోసం అన్నారు. రాష్ట్రాన్ని పొగరహిత రాష్ట్రంగా చేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పానికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సామాన్యులకు అందుబాటులో గ్యాస్ తీసుకువచ్చాయి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీపం పథకం ద్వారా రాయితీ ఇస్తుందని కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం ద్వారా పూర్తి రాయితీతో గ్యాస్ కనెక్షన్ అందజేస్తుందని అన్నారు. లబ్ధిదారులు ఈ పథకం ద్వారా పొందిన గ్యాస్ కనెక్షన్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొంతమంది గ్యాస్ సరఫరా చేసే సమయంలో వినియోగదారుల నుండి బాయ్ లు అధిక ధరలు, అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు. ఈ రకమైన విధానం తగదని అన్నారు. తీరు మార్చుకోకపోతే సంబంధిత ఏజెన్సీల పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.
ఈ సందర్భంలో జిల్లా పౌరసరఫరాల అధికారి ఎన్.సరోజ, తహసిల్దార్ ఫరూక్, హెచ్ పి సి ఎల్ సేల్స్ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్.ఐ ఆంజనేయులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.