జిల్లాలో జల జీవన్ మిషన్ ప్రాజెక్ట్ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుంటూ గుత్తేదారుడు ముందుకు వెళ్లాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జలజీవన్ మిషన్ ఫేజ్ వన్ కింద కోస్తా ప్రాంతంలో తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సంబంధిత శాఖలతో కన్వర్జెన్సీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ స్థితిగతులను ప్రాజెక్ట్ నిర్మాణం గుత్తేదారుడు ప్రతినిధి మెయిల్ కంపెనీ డీజీఎం పి.వాసు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమావేశంలో వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జల జీవన్ మిషన్ ఫేజ్ వన్ కింద పశ్చిమగోదావరి జిల్లాలో స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లోని 16 మండలాలు పరిధిలో 862 గ్రామాలను కలుపుతూ రూ.1400 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 13.25 లక్షల కుటుంబాలకు త్రాగునీటిని అందించేందుకు రూపొందించడం జరిగిందన్నారు. దీని నిర్మాణం కోసం 2,662 కిలోమీటర్లు మేర పైపులైన్లను వేయవలసి ఉంటుందని తెలిపారు. ఎన్ హెచ్-165, 216-A, 216, రాష్ట్ర రహదారులు, ఆర్ అండ్ బి, పంచాయతీ రోడ్లు, రైల్వే ట్రాక్ క్రాసింగ్స్, గేయిల్ పైప్ లైన్స్, ఇరిగేషన్ చానల్స్ మీదుగా పైప్ లైన్స్ నిర్మాణం చేయాల్సి ఉందని, స్ట్రక్చర్స్కు పటిష్టత దెబ్బతినకుండా చాలా జాగ్రత్తగా పైపులైన్లు నిర్మాణం చేపట్టవలసి ఉందన్నారు. ఆయా శాఖలు పైపు లైన్లు వేయుటకు అవసరమైన క్లియరెన్స్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఇవ్వాలని సూచించారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధిత శాఖలు నిర్మాణ సంస్థకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. దీనికి సంబంధించి 55 క్లియర్ వాటర్ సంప్స్, 40 ఓ.హెచ్.బిఆర్.ఎస్, 69 ఓ హెచ్ ఆర్ ఎస్ లు నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. వీటిలో 17 ఓ హెచ్ ఆర్ ఎస్ లు వివిధ నిర్మాణ దశలలో ఉన్నాయన్నారు. 22 ప్రదేశాలలో 895 కెవిఏ విద్యుత్ సరఫరాను అందజేయవలసి ఉందని తెలిపారు. జల జీవన్ మిషన్ ఫేజ్ -2 డిపిఆర్ కూడా సిద్ధం చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. ఎన్ హెచ్, ఆర్ అండ్ బి, గెయిల్ నిర్మాణాల క్రాసింగ్ వద్ద నిర్మాణాలకు రెవిన్య డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకోవాలని సంబంధిత శాఖలకు సూచించారు. పైపులైన్లు వేసేందుకు ముందుగా అన్ని శాఖల అనుమతులు తీసుకోవాలన్నారు. పైపులైను వేసే మార్గంలో ఆక్రమణల తొలగింపులో సంబంధిత అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. పైపులైన్ల నిర్మాణంలో ఎక్కడ కూడా రోడ్లు, కెనాల్స్ గట్లు పాడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిర్దేశించిన సమయంలో ప్రాజెక్టు పనులు పూర్తితో పాటు నిర్మాణంలో నాణ్యత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, నేషనల్ హై వె అథారిటీ అఫ్ ఇండియా ప్రతినిధి సాల్మన్ అన్సారీ, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ ఈఈ కె.శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి ఎస్. ఇ ఎ. శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ సిఇఓ కె. భీమేశ్వర రావు, జిల్లా విద్యుత్ శాఖ అధికారి పులి ఉష, సిపిఒకె. శ్రీనివాస రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్. వెంకటేశ్వర రావు, డ్వామా పీ డి. కె సి హెచ్ అప్పారావు, డిఆర్ డిఎ పీడి ఎం. ఎస్.ఎస్ వేణుగోపాల్, డిఎం అండ్ హెచ్ఒ జి. గీతాబాయ్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖధికారి ఎన్. వి. అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు.