ఆర్డీవోలు ప్రతిరోజు రెండు గ్రామాలలో పర్యటించి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ పర్యవేక్షించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి.
ఒక ప్రత్యేక డ్రైవ్ గా పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ చేసేందుకు రెవెన్యూ అధికారులు శ్రద్ధ తీసుకోవాలి.
పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ సమయంలో రెవెన్యూ అధికారులు రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలి.
కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, క్షేత్రస్థాయిలో సమస్యలపై పై మండలాల వారీగా సంబంధిత ఆర్డీవోలు,తహసిల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రెవెన్యూ అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. విఆర్వోలు రైతుల ఇంటిఇంటికి వెళ్లి పట్టాదారు పాసుపుస్తకాలు అందించి వారితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు. పట్టాదారు పాస పుస్తకాలలో తప్పులు ఉంటే అటువంటి వాటిని పంపిణీ చేయవద్దని సూచించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు జనవరి 9వ తేదీ లోపుగా రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను నూరు శాతం అందించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు. ఈ కేవైసీ తప్పనిసరిగా చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్దేశాన్ని రైతులకు తెలియజేయాలన్నారు. రీ సర్వే గ్రామసభల నిర్వహణ సమయంలో రైతుల నుండి ఎక్కువ సమస్యలు వచ్చిన గ్రామాలలో సంబంధిత ఆర్డీవోలు పర్యటించి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. పట్టాదారు పాసుపుస్తకాల ముద్రణలో తప్పులు దొర్లినట్లయితే సంబంధిత తప్పులను సరిచేసి తిరిగి డేటా పంపించే సమయంలో ఎటువంటి తప్పులు దొరలకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఐ వి ఆర్ ఎస్ కాల్స్ ద్వారా రైతుల స్పందన సంతృప్తికరంగా ఉండే విధంగా వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. గ్రామాలకు బయట ఉన్న రైతులకు ఫోన్ చేసి పట్టాదారు పాసుపుస్తకాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటివరకు పంపిణీ ప్రారంభం కానీ మండలాలలో ఆయా శాసనసభ్యులతో మాట్లాడి వెంటనే పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులు ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్ఓ బి.శివ నారాయణ రెడ్డి,ఆర్డీవోలు, తహసిల్దారులు పాల్గొన్నారు.