Close

పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, అనధికారులకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 01/01/2026

గురువారం కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం నందు నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా ఎస్పి అద్నాన్ నయీo అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దారులు, సిబ్బంది, అనధికారులు, తదితరులు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ని కలిసి పుష్పగుచ్చాలను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలను అందజేశారు. అదేవిధంగా వచ్చిన వారందరికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలను తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి మాట్లాడుతూ నూతన సంవత్సరం వేళ అందరి కుటుంబాల్లో సంతోషాలు వెల్లి విరియాలని, ఆరోగ్యంతో వర్ధిల్లాలని కోరారు. పాడిపంటలతో రైతులు ఆర్థికంగా ఎదగాలని, పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. నూతన సంవత్సరం వేళ విద్యార్థిని, విద్యార్థులు అందరు చక్కగా చదువుకుని జరగబోయే పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి పశ్చిమగోదావరి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేలా కృషి చేయాలన్నారు. విద్యార్ధుల భవిష్యత్ ను చక్కగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తున్నదని, వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోని మంచి భవిష్యత్తును పొందాలన్నారు. సమాజంలో మంచి పౌరులుగా, వ్యక్తులుగా ఎదిగి పుట్టిన గ్రామం, జిల్లా, రాష్ట్రం, దేశానికి మంచి సేవలు అందించాలని జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి ఈ సందర్భంగా ఆకాంక్షించారు.