జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి కార్యదర్శి హోదా పదోన్నతి .. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ–అభినందనలు తెలిపిన జిల్లా జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, జిల్లా అధికారులు.
Publish Date : 29/12/2025
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి కార్యదర్శిగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సోమవారం పిజిఆర్ సమావేశ మందిరం నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. వీరితోపాటు జిల్లా రెవెన్యూ అధికారి బి.శివనారాయణ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ కు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం 2010 బ్యాచికి చెందిన ఐఏఎస్ లకు పదోన్నతి కల్పించిన జాబితాలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి కార్యదర్శిగా సూపర్ టైమ్ స్కేల్ పదోన్నతి కల్పించింది. వీరికి కార్యదర్శి హోదాలో పదోన్నతి కల్పించినా పశ్చి మగోదావరి కలెక్టర్ గానే కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.