Close

మండలాల వారీగా ఎంత యూరియా అవసరమో రైతు సేవా కేంద్రాల్లో, సొసైటీలో నిల్వ ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 29/12/2025

రబి సాగుకు సంబంధించి రైతులకు కావలసినంత యూరియా అందుబాటులో ఉంచాలి

జిల్లా కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ చాంబర్ నుండి సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మండలాలు వారీగా యూరియా నిల్వలు ఎలా ఉన్నాయి, రైతుల అభిప్రాయాలు, రానున్న వారం రోజుల్లో ఏ ప్రాంతంలో ఎంత పరిధిలో నాట్లు జరిగినవి, ఎంత యూరియా అవసరము తదితర అంశాలపై జిల్లాలోని అందరూ వ్యవసాయ శాఖ అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రబి సాగుకు సంబంధించి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కావలసి నంత యూరియాను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులతో అన్నారు. జిల్లాలో మండలాల వారీగా ఎంత యూరియా అవసరమో రైతు సేవా కేంద్రాలు సొసైటీలలో నిల్వ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఏ ప్రాంతంలో ఎంత మేర నాట్లు జరిగినవి, ఎంత యూరియా అవసరమో రైతు సేవా కేంద్రాల సిబ్బంది, అభ్యుదయ రైతులతో చర్చించి సంబంధిత జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయమునకు రిపోర్టు అందజేయాలని మండల వ్యవసాయ శాఖ అధికారులు ఆదేశించారు. మండలాల పరిధిలో ఉన్న ప్రైవేటు దుకాణాలు నిర్వహణపై తరచూ తనిఖీలు నిర్వహించాలని సంబంధిత అధికారులు ఆదేశించారు.

జిల్లాలో యూరియా సరఫరాపై రైతుల యొక్క అభిప్రాయాల సేకరణకు ప్రతి రైతు సేవా కేంద్రం పరిధిలో పదిమంది రైతులతో ముఖాముఖి చర్చకు ఏర్పాటు చేయాలని జిల్ల జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆయా మండలాల వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. అలాగే జిల్లాలోని ఇంకా మిగిలి ఉన్న ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. కొన్ని గ్రామాలలో ఆలస్యంగా నూర్పుడి చేసిన ధాన్యం కొనుగోలు సంబంధించి ఆయా రైతు సేవా కేంద్రాల ద్వారా పూర్తిచేయాలని, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గడిచిన పది రోజులలో ఎక్కడ ధాన్యం కొనుగోలు సేకరణ జరిగినది, ఏ మిల్లులకు ఎంత ధాన్యము దిగుమతి జరిగినది రిపోర్టును అందజేయాలని జిల్లా సివిల్ సప్లయ్ అధికారిని ఆదేశించారు.

ఈ గూగుల్ మీట్ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, జెడ్.వెంకటేశ్వరరావు, డి ఎం సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ ఎండి ఇబ్రహీం, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం ఏవో కృష్ణకాంత్, మండల వ్యవసాయ శాఖ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది తదితరులు ఉన్నారు.