Close

పిఎం లంక గ్రామాన్ని నేను దత్తత తీసుకోవడం కాదు ఈ గ్రామ ప్రజలే నన్ను దత్తత తీసుకున్నారు.–కేంద్ర ఆర్థికశాఖా మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్

Publish Date : 28/12/2025

పీఎం లంక గ్రామం అభివృద్ధి రాష్ట్రస్థాయిలో టాప్ లో ఉండాలి.

పీఎం లంక మారుమూల గ్రామం కాదు ఏఐ టెక్నాలజీలో శిక్షణ అందిస్తున్న ముఖ్య కేంద్రం.

పీఎం లంక గ్రామం అభివృద్ధి మహిళల మద్దతుతో సాధ్యమైంది.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జిల్లా పర్యటన సందర్భంగా ఆదివారం పెదమైనవానిలంక గ్రామంలో డిజిటల్ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

కేంద్ర ఆర్థికమంత్రితో పాటు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, శాసనసభ్యులు, ప్రభుత్వ విఫ్ బొమ్మిడి నాయకర్, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ విఫ్ బొలిశెట్టి శ్రీనివాస్, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, కూటమి నాయకులు హాజరయ్యారు

ఈ సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రశంశా పత్రాలు, మెమొoటోలు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ అందజేసి, అభినందించారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ పిఎం లంక గ్రామం అభివృద్ధి గ్రామ మహిళల మద్దతుతోనే సాధ్యమైంది అన్నారు. ఆంధ్ర కోడలు పెదమైనవానలంక కూతురిగా ఇక్కడ వారికి ఎప్పుడు సుపరిచితమే నన్నారు. పీఎం లంకలో నిర్మించిన సైక్లోన్ భవనం అన్ని విధాలుగా ఉపయోగపడడం సంతోషకరమన్నారు. పియం లంక మహిళల మద్దతు వల్లే సైక్లోన్ భవనం డిజిటల్ భవనంగా మారిందని, డ్రోన్లు నడిపేవారు ఉన్నారన్నారు. కానీ వాటిని ఎలా తయారు చేయాలి, మరమత్తు వస్తే ఏం చేయాలి అసలు డ్రోన్ అంటే ఏంటి ఎలా ఉపయోగించాలి దానిపై ఆంధ్రాలో మొట్ట మొదటిసారిగా పిఎం లంకలో శిక్షణ ఇవ్వడం జరుగుతోందని అన్నారు. శిక్షణ పొందిన యువత దేశ విదేశాల్లో మంచి స్థానంలో ఉన్నారని , వారంతా తమ అభిప్రాయాలను పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విశ్వకర్మ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ జరిగిందని, శిక్షణ ఎలా ఉంది, ఎలా జరిగింది అని దేశవ్యాప్తంగా సర్వే చేయగా జమ్మూ కాశ్మీర్ మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో పిఎం లంక ఉండడం ఎంతో ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. రైతులు, మహిళలు డ్రోన్లు వినియోగించే స్థాయికి చేరుకోవాలన్నారు. పదేళ్ల కిందట ఇదే ప్రాంతంలో పెద్ద కొబ్బరి తోట ఉండేదని, అది సముద్రపు అలల కోతకు సముద్రంలో కలిసి పోయిందన్నారు. అలల తాకిడిని ఆపేందుకు అధునాతన టెక్నాలజీతో అడ్డుకట్ట నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందన్నారు. పదేళ్ల తర్వాత ఇక్కడ ఎంతో మార్పు వచ్చిందని సైక్లోన్ వస్తే ఈ ప్రాంతాన్ని ఎలా రక్షించాలని ఆలోచన నుంచి ఏఐ శిక్షణ వరకు అభివృద్ధి చెందిందన్నారు. పీఎం లంక వాసులకు పీఎం ఆవాస్ యోజన కింద 146 మందికి ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని, అవి రాబోయే 12 నెలలలో పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. మత్స్యకారులకు బోట్లు అందించేందుకు ధరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని అవి కూడా ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నిర్మలా సీతారామన్ సూచించారు.

కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ దేశ ప్రగతికి, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ క్రియాశీలక పాత్ర నిర్వహిస్తున్నారన్నారు. 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ నాలుగో స్థానానికి తీసుకురావడంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా తీసుకున్న సంస్కరణలతో సాధ్యమైందన్నారు. పీఎం లంక, తూర్పు తాళ్ల గ్రామాలలో ఇంటింటా మరుగుదొడ్లు, స్కూలు భవనాల నిర్మాణాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. పీఎం లంక సముద్రపు కోతకు గురి కాకుండా రక్షణ గోడకు 13.50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం త్వరలో పూర్తికానున్నట్లు తెలిపారు. పెదవైనవాని లంకలో డిజిటల్ భవనం నిర్మాణం పూర్తి చేసుకోవడం, వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా విద్యావంతులకు ఉపాధి కలుగుతుంది అన్నారు.

రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పీఎం లంక గ్రామానికే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా రక్షణగా నిలుస్తున్నారన్నారు. మహిళలు ఆలోచన విధానం మేరకు తగు నిర్ణయాలు తీసుకుంటారన్నారు. కోవిడ్ సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన సేవలు దేశ ప్రజలు మరిచిపోరన్నారు. ఆర్థిక సంస్కరణలు ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను 11వ స్థానం నుండి నాలుగవ స్థానానికి తీసుకోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నను అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ఎంతో సహకరిస్తున్నారని కొనియాడారు.

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ భారతదేశ ఉపఖండంలో శక్తివంతమైన వ్యక్తి, ప్రపంచ వ్యాప్తంగా భారతదేశాన్నికీ గుర్తింపు తెచ్చిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. నేను చదువుకున్న రోజుల్లో అభివృద్ధి చెందుతున్న భారతదేశంగా చుదువుకున్నామని, నేటి యువత అభివృద్ధి చెందిన భారతదేశంగా చదువుకునే అవకాశం ఎన్డీఏ ప్రభుత్వం తీర్చిందని అన్నారు. కేంద్ర మంత్రివర్గంలో హేమాహేమీలు ఉన్నారని, వారిలో నిర్మలా సీతారామన్ ఒకరు అని అన్నారు. రాష్ట్ర విభజన కంటే 2019 -24 పాలకుల వలన అధికనష్టం వాటిల్లిందని అన్నారు. రూ 14 లక్షలు కోట్లు అప్పుఉన్నను, ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కారుతో రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్ట గలిగామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే పోలవరం పూర్తి అవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 గోదావరి పుష్కరాలకు ముందే జాతికిఅంకితం చేస్తామని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటు రెండు సార్లు ప్రైవేటీకరణ నిలుపుదల చేసిన ప్రధానులు స్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పాయ్, నరేంద్ర మోదీ అని, ఆయా కాలాల్లో రాష్ట్ర ముఖ్య మంత్రిగా చేసింది మన నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జిల్లాలో ఏకైక నరసాపురం తీర ప్రాంతాన్ని, దత్తత గ్రామం పెదమైనవాని లంక అభివృద్ధి చేసి, భారతదేశ పటంలో ప్రత్యేకస్థానం ఇచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభినందనీయులు అన్నారు.

జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో తీర ప్రాంతంలో ఏకైక దత్తత గ్రామం పెదమైనవానిలంక అన్నారు. ఈ గ్రామంలో కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చాలా ఆనందంగా ఉందని అన్నారు. తీర ప్రాంతంలో అభివృద్ధి, సంక్షేమం, యువతకు స్కిల్ డెవలప్మెంటు శిక్షణ ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెండుగా కలుగుతున్నాయని అన్నారు. రూ 13.50 కోట్ల వ్యయంతో సముద్రపు కోత గురికాకుండా రాయికట్టు ద్వారా సముద్రపు కోత ముప్పునుండి గ్రామాన్ని కాపాడే రక్షణకవచం పనులు 55 శాతం పనులు పూర్తి అయ్యాయని, త్వరలో పనులు పూర్తిచేస్తామని అన్నారు. నాబార్డు, వివిధ కార్పొరేటు సంస్థలు, వివిధ బ్యాంకులు ద్వారా ఈ గ్రామం, డిజిటల్ భవనం మరింత అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతామని అన్నారు.

నరసాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విఫ్ బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ తీరప్రాంతం అభివృద్ధికి, పకృతి వైపరీత్యాలు సమయంలో సముద్రపు రక్షణ కవచం, డిజిటల్ భవనంతో నిర్మలా సీతారామన్ తీరప్రాంతాన్నికి తల్లి అయ్యిందని అన్నారు. జిల్లాలో చివరి ప్రాంతం, తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ప్రపంచపటంలో గుర్తింపు తెచ్చిన ఘనత కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ కే దక్కుతుందని అన్నారు. జీఎస్టీ ద్వారా పతి కుటుంబానికి నెలకు రూ.8 వేలు నుండి రూ.12 వేలు వరకు ఆదా అయ్యి, ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం అయ్యిందని అన్నారు. సియస్ ఆర్ నిధులు ద్వారా తీరప్రాంతం అభివృద్ధికి ఖర్చు చేయడం శుభపరిణామం అన్నారు. తీర ప్రాంతం చిరకాల కోరిక, తీర ప్రాంతం రూపురేఖలు మార్చే ఫిషింగు హర్బరు పూర్తి చేయుటకు కృషి చెయ్యాలని, అలాగే పేరుపాలెం బీచ్ కి ప్రసిద్ధి అని అభివృద్ధికి కృషి చెయ్యాలని ఈ సందర్భంగా కేంద్రఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. నియోజకవర్గం కూటమి ప్రభుత్వం లో డబుల్ ఇంజన్ సర్కారుతో అభివృద్ధి, సంక్షేమంతో ముందుకు దూసుకువెళ్ళుతుందని అన్నారు.

ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత గ్రామం పెదమైనవానిలంక గ్రామానికి రావడం ఎంతో సంతోషం కలిగిందని అన్నారు. ఈ గ్రామం వస్తుంటే నేషనల్ హైవే ద్వారా ఒక పట్టణానికి వచ్చినట్టుందని, తీర ప్రాంతం రూపురేఖలు మారి పోయాయని అన్నారు. కార్పొరేటు సంస్థలు, వివిధ బ్యాంకులు సహకారంతో తీరప్రాంతాన్ని అభివృద్ధి చేసి భారతదేశ పటంలో ఈ గ్రామానికి మంచి గుర్తింపును తీసుకువచ్చారని అన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ దేశ, రాష్ట్రాలు ఆర్థిక పరిస్థితులు చక్కబెడుతూ మంచి క్రియాశీలక పాత్రను పోషిస్తున్నారని అన్నారు. రానున్న పదేళ్ళలో ప్రపంచంలోనే మన భారతదేశం మొదటి స్థానంలో నడుస్తుంది అనడంలో ఏ విధమైన సందేహం లేదని అన్నారు.

అనంతరం పీఎం లంక సముద్ర తీరాన సముద్రపు కోతకు గురి కాకుండా సి ఎస్ ఆర్ నిధులు రూ.13.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న అడ్డుకట్ట నిర్మాణం పనులను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో కలిసి స్వయంగా పరిశీలించి, ప్రాజెక్ట్ చేపట్టిన ఎలైట్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి వివరాలను తెలుసుకుని, పనుల నిర్మాణం ప్రజెంటేషన్ ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించారు. అంతకుముందు అక్కడే ఉన్న శివాలయాన్ని దర్శించుకుని వేదపండితుల ఆశీర్వచనాలను తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి, సైయెంట్ ఎండి బి.వి.ఆర్ మోహన్ రెడ్డి,యూనియన్ బ్యాంక్ డి.ఎఫ్. ఎస్ డైరెక్టర్ వివేక్ గుప్త, ఎగ్జిమ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ దీపాలి అగర్వాల్, ఎండి, సీఈవో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆసీస్ పాండీ, నాబార్డ్ సీజీఎం ఎం.ఆర్. గోపాల్, స్టేటు బ్యాంకు ఆఫ్ ఇండియా జిఎం సైలేష్ కుమార్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జిఎం సి.బి. ఎన్.భాస్కరరావు, గేమ్స్ ఫౌండేషన్ పిడి సుభాష్, ఆర్డీవో దాసి రాజు, డియస్పి డా.జి.శ్రీవేద, ఏపి మత్స్యకార అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు, జిల్లా డిసియంయస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, నరసాపురం టీడీపీ ఇంచార్చి పొత్తూరి రామరాజు, జిల్లా మత్స్యకార సహకార సంఘాల అధ్యక్షులు యం.వసంతరావు, జిల్లా బిజెపి అధ్యక్షులు అయినం పూడి శ్రీదేవి, కేంద్రమంత్రి ప్రతినిధి పేరాల మోహన్, బ్యాంకు అధికారులు, జిల్లా,డివిజన్, మండల అధికారులు, గ్రామ సర్పంచి కొల్లాటి కనకదుర్గ, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, మత్స్యకార నాయకులు, మత్స్యకార కుటుంబాలు ప్రజలు, స్థానిక ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

1.111