నూతన పరిశ్రమల స్థాపనకు అవసరమైన సహాయ సహకారాలను అందించడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
పర్యావరణ హితమైన పరిశ్రమల స్థాపనకు నూతన పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి
రానున్న రోజుల్లో జిల్లా అభివృద్ధికి పరిశ్రమలు కీలకపాత్ర పోషించాలి
కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం బుధవారం నిర్వహించడం జరిగింది. తొలుత గత సమావేశంలో తీసుకున్న చర్యల నివేదికను జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సమావేశంలో వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయం, ఆక్వా రంగాలలో అభివృద్ధి సంతృప్తికరంగానే ఉన్నదని, పారిశ్రామికంగా అభివృద్ధికి మరింత కృషి చేయాలన్నారు. జిల్లాలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనేకమంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని, నూతన పరిశ్రమల స్థాపనకు అనుమతులు, బ్యాంకు రుణాలు మంజూరు, మౌలిక వసతుల కల్పనలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వ భూములు అందుబాటులో లేవని సాధ్యమైనంత వరకు నూతన పారిశ్రామికవేత్తలు సంబంధిత భూ యజమానుల భాగస్వామ్యంతో పరిశ్రమల స్థాపనకు ఆలోచన చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ రంగాలకు సంబంధించిన ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం కొనసాగుతున్న పరిశ్రమల వివరాలు, కొత్తగా ప్రారంభించబోయే పరిశ్రమలు, వ్యాపారాలు గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొంతమంది ఇన్వెస్టర్లు సమావేశం దృష్టికి తీసుకువచ్చిన అంశాలపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖలను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా బయో డిగ్రేడబుల్ ప్లాంట్, డైరీ ఫార్మ్, ఫ్యాబ్రికేషన్ ఇన్వెస్ట్మెంట్, ప్లాస్టిక్ రీసైక్లబుల్ పెట్ బాటిల్స్, ఐస్ బ్లాక్స్ మేకింగ్ తదితర పరిశ్రమల వ్యవస్థాపకులతో వారు నెలకొల్పుచున్న పరిశ్రమల వివరాలను, పెట్టుబడులను, ఉద్యోగాల కల్పనను, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలో పరిశ్రమల శాఖ ప్రగతి పై సమీక్షిస్తూ డిసెంబర్ 9,2025 నుండి డిసెంబర్ 24 వరకు వివిధ శాఖల అనుమతుల కోసం 1,117 ధరఖాస్తులు అండగా 916 దరఖాస్తులను ఆమోదించడం జరిగిందని, నిర్ణీత గడువు లోపుగా ఉన్న మరో 201 ధరఖాస్తులు పరిష్కరించవలసి ఉందన్నారు. మిగిలిన అనుమతులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరిశ్రమలు స్థాపించిన ఎమ్.ఎస్.ఎం.ఇ లకు జనరల్ కేటగిరీలో పదిమందికి రూ.22,66,739/- లు, ఓబిసి క్యాటగిరిలో ఇద్దరికీ రూ.3,28,790/- లు ఇన్సెంటివ్ ను మంజూరు చేయడం జరిగింది. పిఎంఈజీపి పథకం కింద 2025-26 సంవత్సరం డిసెంబర్ 23 వరకు యూనిట్ల స్థాపన మంజూరు కొరకు 112 దరఖాస్తులను బ్యాంకులకు పంపడం జరిగిందని, 104 దరఖాస్తులను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 300 యూనిట్లను స్థాపించడం జరిగిందన్నారు. పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించేలా సెప్టెంబర్ రెండు నుండి డిసెంబర్ 18 వరకు 25 ర్యాంపు వర్క్ షాపులు నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే పెనుమంట్ర మండలం మల్లిపూడి
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతి రావు, నాబార్డ్ డీడీఎం ఎల్.నిషాంత్ చంద్ర, ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ స్వాతి, పర్యావరణ శాఖ సహాయ ఇంజనీర్ సంధ్య డయానా, ఎల్ డి ఎం.నాగేంద్ర ప్రసాద్, జిల్లా లేబర్ ఆఫీసర్ ఏ.లక్ష్మి, ఫిషరీస్ డి.ఓ వివేక్, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి ఎన్.వి.అరుణ కుమారి, ఎఫ్ ఏ పి సి సి ఐ ప్రతినిధి పి. రామచంద్రన్, జిల్లా అగ్నిని మాపక శాఖ అధికారి బి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.