Close

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి విచ్చేసే అతిధులకు, ఉన్నతాధికారులకు ప్రోటోకాల్ విషయంలో ఏ విధమైన లోటుపాట్లకు తావులేని విధంగా అధికారులు వ్యవహరించాలి.. … జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 23/12/2025

డిసెంబర్ 28న పశ్చిమగోదావరి జిల్లా పెదమైనవానిలంకకు రానున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్…

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలి..

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ దత్తత గ్రామమైన మొగల్తూరు మండలం పెద్దమైనవానిలంక గ్రామాన్ని ఈనెల 28వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సందర్శించి పలు అభివృద్ధి, సంక్షేమ, ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ శాఖల అధికారులతో సమావేశమై కేంద్రమంత్రి పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సమీక్షలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, నరసాపురం ఆర్డీవో దాసిరాజు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి పేరాల మోహన్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కేంద్రమంత్రి పర్యటనను వివరిస్తూ తొలుత 28వ తేదీన మనకి బాత్ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, ప్రజలతో ముఖాముఖిలో పాల్గొంటారు. కవిటం లో నిర్మించిన దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం, అనంతరం పెద్దమైన వానిలంక వద్ద సముద్రపు కోతకు గురి అవుతున్న ప్రాంతానికి సిఎస్ఆర్ నిధులు రూ.13.5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సముద్రపు కోత అడ్డుకట్ట పనులను పరిశీలించనున్నారని, సియోన్ట్ ప్రవేట్ లిమిటెడ్ కంపెనీ సమకూర్చిన సి ఎస్ ఆర్ నిధులుతో డిజిటల్ భవన్ నందు ఏర్పాటుచేసిన డ్రోన్, ఏఐ నైపుణ్య శిక్షణ తరగతుల ప్రారంభం, వికసిత్ భారత్.. డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ తో జిల్లాలోని 244 పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న పెయింటింగ్ పోటీలలో ఎంపికైన ఫైనల్ విజేతలకు డిజిటల్ భవన్ నందు డిసెంబర్ 28న నిర్వహిస్తున్న పోటీలను పరిశీలించి గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానం, వందేమాతరం పాటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేస్తారు. అనంతరం పేరుపాలెంలో దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలలో పాల్గొన్నట్లు తెలిపారు. అధికారులకు తమకు అప్పగించిన బాధ్యతలను తూచా తప్పకుండా నిర్వహించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, నరసాపురం ఆర్డీవో దాసిరాజు, కేంద్రమంత్రి వ్యక్తిగత కార్యదర్శి పేరాల మోహన్, జిల్లా అధికారులు వ్యవసాయ శాఖ, డిఆర్డిఏ, డ్వామా, డిఎం అండ్ హెచ్ ఓ, డీఎస్ఓ, డిఈఓ, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఎక్సైజ్, ఎల్ డి ఎం, కమర్షియల్ టాక్స్, విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్, ఫిషరీస్, డి ఎల్ డి ఓ, టూరిజం, మొగల్తూరు, నరసాపురం, పోడూరు తహసిల్దార్ లు, తదితరులు పాల్గొన్నారు.