జిల్లాలో రబి సీజనుకు సరిపడినంత యూరియా నిల్వలు సొసైటీలు, ఆర్ ఎస్ కె లు, ప్రైవేట్ డీలర్స్ వద్ద అందుబాటులో ఉన్నాయి. రైతాంగం ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు.
ఎంఆర్పీ ధర కన్నా ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించవలసిన అవసరం లేదు.
రైతులకు యూరియాకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ కు తెలియజేస్తే పరిష్కార చర్యలు తీసుకుంటాం.
యూరియా లభ్యత, ధరలు, క్షేత్రస్థాయి సమస్యలు, రైతుల సందేహాలుపై గూగుల్ మీట్ ద్వారా జాయింట్ కలెక్టర్ రైతులతో ముఖాముఖి…… యూరియా సరఫరాపై అధికారులు తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన రైతులు..
….జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.
కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఎరువులు లభ్యత, వినియోగం, క్షేత్రస్థాయి సమస్యలు, రైతుల సందేహాల నివృత్తిపై ఏ డి ఏ లు, ఎంఏఓలు, విఏఓలు, ఆర్ ఎస్ కె ఇన్చార్జులుతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా వివిధ ఆర్.ఎస్.కెల నుండి హాజరైన రైతులతో గూగుల్ మీట్ ద్వారా ముఖాముఖిగా జాయింట్ కలెక్టర్ మాట్లాడారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రబి సీజనుకు సరిపడినన్ని యూరియా నిల్వలు సొసైటీలు, ఆర్ ఎస్ కె లు, ప్రైవేట్ డీలర్స్ వద్ద అందుబాటులో ఉన్నాయని, రైతాంగం ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఎమ్మార్పీ ధర కన్నా ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రైతులు పంటకు కావలసిన యూరియా ఒకేసారి కాకుండా అవసరం మేరకు దఫ దఫాలుగా కొనుగోలు చేయాలన్నారు. సొసైటీలు, ఆర్ఎస్కె లలో రాబోయే 20 రోజులకు సరిపడా యూరియా నిల్వ అందుబాటులో ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఎవరైనా డీలర్లు నిబంధనలు ఉల్లంఘించి, ఎరువుల కృత్రిమ కొరత సృష్టించినా, ఎరువులను మళ్లింపు చేసిన, ఎం ఆర్ పి ధరల కంటే ఎరువులను అధిక ధరలకు విక్ర యించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
ఈ సందర్భంగా మాధవరం, నవాబ్ పాలెం, పెంటపాడు, పడమర విప్పర్రు, తణుకు, పెనుమంట్ర, పెనుగొండ ఆర్ ఎస్ కె ల నుండి హాజరైన రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి మాట్లాడుతూ ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు, యూరియా కొనుగోలుపై ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఎంత ధరకు కొనుగోలు చేస్తున్నారు, సొసైటీలు, డీలర్ల వల్ల ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా తదితర అంశాలపై రైతులతో మాట్లాడారు. రైతులు యూరియా సక్రమంగా దొరుకుతుందని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొంటున్నామని, అదనపు ధరలు చెల్లించడం లేదని, ఎటువంటి ఇబ్బందులు లేదని జాయింట్ కలెక్టర్ కు రైతులు తెలియజేశారు.
యూరియాకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్న రైతులు కంట్రోల్ రూమ్ కు కాల్ చేసి తమ ఫిర్యాదులు తెలియజేయవచ్చని జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు.
ఈ గూగుల్ మీట్ లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, ఏ డి ఏ లు, ఎం ఏ ఓ లు, వీఎవోలు, రైతు సేవా కేంద్రాల ఇన్చార్జులు, సిబ్బంది పాల్గొన్నారు.
