ఉగాది నాటికి పీఎంఏవై 1.0 క్రింద 11,859 ఇళ్ల నిర్మాణాల లక్ష్యాన్ని నూరు శాతం పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులకు ఆదేశాలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
ఆప్షన్ త్రీ ఇళ్ల నిర్మాణాలను నిర్ణీత గడుపులోపు పూర్తి చేయకపోతే గుత్తేదారులపై తీవ్ర చర్యలు ఉంటాయి. నిర్లక్ష్య ధోరణిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు
శనివారం రాత్రి పొద్దుపోయాక భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరము నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆప్షన్ -3 ఇళ్ళ నిర్మాణాలపై సంబంధిత గుత్తేదారులతో, పీఎంఈవై 1.0 ఇళ్ల నిర్మాణాల లక్ష్యాలపై గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు. పిఎంఏవై 1.0 ఆప్షన్ -3 ఇళ్ళ నిర్మాణాలలో అజయ్ వెంచర్స్, పల్లా ఏసుబాబు, జి వెంకటేశ్వరరావు లు నిర్లక్ష్య ధోరణి కనిపిస్తున్నదని, ఇకనుండి ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తిచేసి అప్పగించకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఆప్షన్ త్రీ కింద 6,332 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 1,187 ఇళ్ళను మాత్రమే పూర్తి చేయడం జరిగిందని, ఇంకా 5,145 ఇళ్లను పూర్తి చేయాల్సి ఉందన్నారు. పూర్తి చేయని పక్షంలో చర్యలకు వెనుకాడేదేలేదని గట్టిగా వక్కాణించారు. మిగతా గుత్తా గుత్తేదారులు కూడా ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి అప్పగించాలన్నారు. పీఎంఏవై 1.0 లో వివిధ కేటగిరీల కింద జిల్లా మొత్తం 56,210 గృహ నిర్మాణాలు మంజూరు కాగా ఇప్పటివరకు 37,821 గృహ నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించడంతో 72% లక్ష్యాన్ని సాధించడం జరిగిందన్నారు. గృహ నిర్మాణాల ప్రగతిలో జిల్లా రాష్ట్రస్థాయిలో ఐదో స్థానంలో నిలిచిందన్నారు. ఉగాది నాటికి 11,859 ఇళ్ల నిర్మాణాలు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని వీటిలో ఆప్షన్ త్రీ కింద 5,078, సొంత స్థలము కలిగిన వారు 677, లేఔట్లలో 6,104 ఇళ్ళు మొత్తం 11,859 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఉగాది నాటికి ఎట్టి పరిస్థితుల్లో 11,859 ఇళ్ల నిర్మాణాల లక్ష్యాన్ని నూరు శాతం పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి.పిచ్చయ్య, ఇళ్ల నిర్మాణాల గుత్తేదారులు, వారి ప్రతినిధులు, గృహ నిర్మాణ శాఖ డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.