ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా పూర్తి చేయడానికి అధికారులు కృషి చేయాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.
భీమవరం కలెక్టరేట్ ఛాంబర్ నుండి గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఖరీఫ్ 2025-26 సీజన్ ధాన్యం కొనుగోలు పురోగతిపై పౌరసరఫరాలు, రెవెన్యూ, అగ్రికల్చర్, సహకార శాఖ అధికారులతో మండలాల వారీగా గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పురోగతిపై ధాన్యం సేకరణ కేంద్రాలు పనితీరు, రైతులు చెల్లింపులు లక్ష్యాలు, సాధనపై అడిగి తెలుసుకున్నారు. రైతు సమస్యలు పరిష్కరించడంతోపాటు, కొనుగోలు సజావుగా సాగేలా చూడాలన్నారు. మండలాల వారీగా సమీక్షిస్తూ లక్ష్యాల మేరకు కొనుగోలు జరుగుచున్నదా, లేదా అని ఆరా తీశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. చెల్లింపుల్లో జాప్యం లేకుండా 48 గంటల్లో రైతులు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూడాలన్నారు. మిల్లులలో ట్రక్ షీట్లు తీయడం, రసీదు ఇవ్వడం, ఎఫ్డిఓలు జనరేట్ చేయడం వంటి వాటివలన సాంకేతిక ఇబ్బందులతో దాన్యం సేకరణలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రశ్నించి, వివిధ అంశాలపై పలు సూచనలు జారీ చేశారు. జిల్లాలోని కొన్ని మిల్లులు వద్ద ట్రక్ షీట్లు ఆలస్యము అవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని అటువంటి రాకుండా అధికారులు చూడాలన్నారు. టోల్ గెట్ దాటి వేరే ప్రాంతానికి పంపవలసి వస్తే మిల్లర్లు ముందుగా తెలియజేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. రైతులు ధాన్యం విక్రయించడంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్న జిల్లా కార్యాలయం నందు ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నెంబర్లు 8121676653, 18004251291 ను సంప్రదించాలని అన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ఖరీఫ్ ధాన్యం సేకరణ విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు.
గూగుల్ మీట్ లో సివిల్ సప్లయ్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ ఎండి ఇబ్రహీం, డీఎస్ఓ ఎన్.సరోజ, ఏఎస్ఓ ఎం.రవిశంకర్, డీఎస్ఓ కె.మురళీకృష్ణ, డీఏవో జెడ్.వెంకటేశ్వరరావు, తహసిల్దార్లు, ఎంఏఏఓలు, ఎంఎల్ఓలు, తదితరులు పాల్గొన్నారు.