Close

పి.ఎం.ఎం.వై.ఎస్ పథకం ద్వారా తక్కువ యూనిట్ క్యాస్ట్ తో ఎక్కువ మందికి ప్రయోజనం ఉంటుంది–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 18/12/2025

ప్రజల సానుకూల స్పందనలో రాష్ట్రంలోనే పశ్చిమగోదావరి జిల్లా మేటిగా నిలిచింది…

సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు ఫలితాలు వెల్లడి..

జిల్లాలోని వివిద అంశాలపై 71 శాతం ప్రజల సానుకూల స్పందనతో మొదటి స్థానం …

గురువారం ముగిసిన రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్…

26 జిల్లాల ర్యాంకింగ్ లో ఎరువులు లభ్యత, ప్రజా పంపిణీ వ్యవస్థ, ఆర్ ఓ ఆర్ సర్వే, మహిళలపై నేరాల కట్టడి మొదటి స్థానంలో నిలువగా, విద్యుత్ సర్వీసులు, మాదక ద్రవ్యాల నియంత్రణ, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, ప్రజా వైద్యం, ఆర్ అండ్ ఎస్ రిజిస్ట్రేషన్లు రెండో స్థానంలో నిలిచాయి. ఆర్టీసీ బస్సులు, దీపం 2.0 పథకం అమలు, శానిటేషన్ మూడో స్థానంలో నిలువగా, పంచాయతీ సేవలు నాలుగో స్థానంలో ఉన్నాయి. ఎఫ్ లైన్ సర్వే, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్లు, అన్నా క్యాంటీన్ల నిర్వహణ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, విత్తనాలు అంశాలపై వరుసుగా 8 నుండి 13 ర్యాంకుల వరకు పొందడం జరిగింది.

కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మత్స్యకార పథకం ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన పథకం ద్వారా అందిస్తున్న యూనిట్లపై మాట్లాడుతూ రూ.5 లక్షల యూనిట్ విలువతో బోట్స్ ఇవ్వవచ్చునని, వాటిలో 33 అడుగుల బోటు, 150 కేజీల వల, 5 హార్స్ పవర్ మోటార్ వస్తుందన్నారు. అలాగే బోట్స్ యూనిట్ రూ.5 లక్షల కాకుండా, యూనిట్ విలువ రూ. ఒక లక్ష, రెండు లక్షలు, మూడు లక్షలుగా ఉంటే ఎక్కువ మంది లబ్ధిదారులు తీసుకుంటారని తెలిపారు. ఈ పథకం ద్వారా అలాగే మోపెడ్స్, ఆటోలు కూడా ఉన్నాయన్నారు. అదేవిధంగా రూ.20 నుండి రూ.25 లక్షల యూనిట్ కాస్ట్ విలువచేసే వాహనాలు ఉన్నాయని వాటి స్థానంలో యూనిట్ విలువ రూ.12 లక్షల వ్యయంతో వాహనాలు అందించేలా ఉంటే బాగుంటుందని సమావేశంలో వివరించారు.

రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన రెండు రోజుల కలెక్టర్ల సమావేశం గురువారంతో ముగిసింది. రెండో రోజు జరిగిన కలెక్టర్ల సమావేశంలో జిల్లాల ఉత్తమ ఆచరణలు, విజయగాథలను పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. “స్వర్ణ ఆంధ్ర @ 2047 – పది సూత్రాలు” పై సమగ్ర చర్చ జరిగింది. పేదల రహిత ఆంధ్ర, నైపుణ్యాభివృద్ధి & ఉపాధి, జనాభా నిర్వహణ, నీటి భద్రత, వ్యవసాయ–టెక్నాలజీ, గ్లోబల్ లాజిస్టిక్స్, ఇంధన వ్యయ తగ్గింపు, ఉత్పత్తి పరిపూర్ణత, స్వచ్ఛ ఆంధ్ర, దీప్‌టెక్ వంటి అంశాలు చర్చించబడ్డాయి. నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి కార్యక్రమాలు, జాబ్ మేళాల అమలు ప్రగతి పై సమీక్ష చేశారు. రెవెన్యూ మరియు ఆదాయ శాఖల పనితీరు, విశ్లేషించడం జరిగింది. చివరిగా లా & ఆర్డర్ అంశంపై జిల్లాల స్థాయిలో తీసుకోవలసిన చర్యలు చర్చించడం జరిగింది.