గ్యాస్ ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ చార్జి వసూలు చేసిన చర్యలు తప్పవు–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
వినియోగదారులకు ఇంటి వద్దకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయాలి
మంగళవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశం నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి దీపం పథకం కింద లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ అమలు తీరుపై పౌరసరఫరాల అధికారులు గ్యాస్ డీలర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సిలిండర్ రేటు కన్నా అదనంగా ఎటువంటి చార్జీలు వసూలు చేసిన సంబంధిత గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు చేస్తామని అన్నారు. దీపం పథకం -2 సబ్సిడీ అమౌంట్ ఆలస్యం కాకుండా అకౌంట్లో జమ చేయాలని అన్నారు. ఐ వి ఆర్ ఎస్ కాల్స్ ద్వారా గ్యాస్ సిలిండర్ లు డెలివరీ బాయ్స్ యొక్క ప్రవర్తన మరియు గ్యాస్ ధర కంటే ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నారని లబ్ధిదారుల నుండి వచ్చే ఫిర్యాదులుపై మాట్లాడారు. పౌరసరఫరాల అధికారులు డీలర్స్ సంబంధించి లబ్ధిదారుల నుండి ఎటువంటి నెగిటివ్ స్పందన వచ్చిన గ్యాస్ ఏజెన్సీలపైన చర్యలు తప్పవని అన్నారు. గ్యాస్ రసీదులో ఉన్న చార్జి కంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క రూపాయి కూడా వినియోగదారుల నుండి వసూలు చేసిన చర్యలు తప్పవని గ్యాస్ ఏజెన్సీలను హెచ్చరించారు. గ్యాస్ సరఫరాలో పారదర్శకత, వినియోగదారుల సంతృప్తిని పెంచే లక్ష్యంతో ఏజెన్సీలు పనిచేయాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ఎన్ సరోజ, ఏ ఎస్ ఓ ఎం రవిశంకర్, సివిల్ సప్లయిస్ డి.టిలు, జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీలు ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.