డివిజన్ స్థాయిలో ఉద్యోగులు క్రీడా సంబరాలు ప్రారంభం
ఉద్యోగులు తమ విధులతో పాటు క్రీడలలో పాల్గొనడం వలన వారి మధ్య స్నేహ పూర్వక వాతావరణం తో పాటు ఆసక్తిని ఉత్సాహాన్ని నింపుతుంది
వారి శరీరక మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది
జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి
శనివారం స్థానిక వైన్ కళాశాల పీజీ క్యాంపస్ గ్రౌండ్ లో నరసాపురం డివిజన్ స్థాయి ఉద్యోగుల క్రీడలు పోటీలను జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు తమ విధులతో పాటు క్రీడా పోటీలలో పాల్గొనడం వలన వారి మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందిస్తుందని అన్నారు.
వీటిలో అనేక శాఖలకు సంబంధించిన ఉద్యోగులు పాల్గొనడం వలన ఒకరికి ఒకరు తెలియడం వలన ఆసక్తిని, ప్రోత్సాహాన్ని నింపుతుందని అన్నారు. క్రీడలలో పాల్గొనడం వలన శరీరక మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుందని అన్నారు. జిల్లాలోని భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెంలలో ఈ రోజు డివిజన్ స్థాయి క్రీడ సంబరాలను ఒక పండుగ వాతావరణంలో ప్రారంభించు కోవడం జరిగిందని అన్నారు. జిల్లాలో 3,500 మంది వివిధ శాఖల ఉద్యోగులు క్రీడలలో పాల్గొంటున్నారని అన్నారు. ఇందులో 1,100 మంది మహిళ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషమని అన్నారు. క్రికెట్, వాలీబాల్, సెటిల్ బ్యాట్మెంట్, క్యారమ్స్, చెస్, టెన్నిస్ వంటి 8 రకాల క్రీడలలో పై స్థాయి నుండి కిందిస్థాయి ఉద్యోగుల వరకు పాల్గొనడం జరుగుతుందని అన్నారు. ఉత్సాహంగా క్రీడలలో పాల్గొని అందరిలోనూ ఆసక్తిని ఉత్సాహాన్ని నింపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి .రాహుల్ కుమార్ రెడ్డి, క్రీడాకారులకు సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో దాసిరాజు స్వయంగా క్రీడలలో పాల్గొని క్రీడాకారులకు ఉత్సాహాన్ని నింపారు, ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ దాసిరాజు, తహసిల్దార్లు ఐతం సత్యనారాయణ, రాజ్ కిషోర్, ఎంపీడీవోలు వివిధ శాఖల డివిజన్ మండల స్థాయి అధికారులు ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు.