బాలల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసమునకు బాలోత్సవాలు మైలురాయి–జిల్లా కలెక్టర్ నాగరాణి
బాలలే సమాజాన్ని, దేశాన్ని నడిపించే శక్తులు
బాలల్లో మంచి క్రమశిక్షణకు బాలోత్సవాలు దోహదపడతాయి
స్థానిక ఎస్సార్ కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ప్రారంభమైన బాలోత్సవాలు 12, 13 తేదీలలో జరుగనున్నాయి. భీమవరం బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో వరుసగా 3వ సంవత్సరం నిర్వహిస్తున్న బాలల సంబరానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్సీ గోపి మూర్తి లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ నేడు పిల్లలు చదువుల గదిలోనో అంతర్జాలంతోనో పరిమితం కాకుండా విద్యార్థులు వినోదం , మానసిక వికాసం కోసం బాలోత్సవాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు.
సమాజంలో కన్పిస్తున్న నవ్వపోకడలు నేడు బాల, బాలికలు, విద్యార్థులపై కూడా ప్రభావం చూపిస్తున్నాయని, ప్రేరణ కలిగిస్తున్నాయని ఈ నేపథ్యంలో బాల బాలికలకు ఆటవిడుపుగా సామాజిక సాంస్కృతిక అంశాలు, క్రమశిక్షణ, శ్రమ, దేశభక్తి అభ్యుదయ భావాలు ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత పెంపొందించడంలో బాలోత్సవములు బాగా ఉపయోగపడతాయన్నారు. మన కంటి వెలుగు, మన కలల వెలుగు, దేశానికి వెలుగు బాలలే అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్సీ బి.గోపి మూర్తి మాట్లాడుతూ గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవని, పెద్దవాళ్లు పిల్లలకు నీతి కథలు, చరిత్ర చెప్పడం, సమాజంలో నడవడిక నేర్పడం కారణంగా మంచి క్రమశిక్షణతో మెలిగేవారన్నారు. నేడు చిన్న కుటుంబాలుగా మారడం, అందరూ సెల్ ఫోన్ లో మునిగిపోవడం ఎవరిదారి వారిది అన్నట్టుగా ఉందన్నారు. ఇటువంటి బాలోత్సవాలు నిర్వహణ ద్వారా బాలల్లో మంచి సత్ప్రవర్తన, సృజనాత్మకత పెంపొందిస్తాయన్నారు.
తొలుత జిల్లా కలెక్టర్ జాతీయ జెండాను ఎగరవేసి బాల, బాలికలను ఉత్సాహపరిస్తూ మాట్లాడారు వారి వద్దకు వెళ్లి శుభాశీస్సులు అందించారు.
అనంతరం శాస్త్రవేత్తలు స్వామి జ్ఞానానంద, డాక్టర్ ఎమ్మార్ రాజు, ఎల్లా ప్రగడ సుబ్బారావు , కవి సాహితీవేత్త అడవి బాపిరాజు, ఎల్లాప్రగడ సుబ్బారావు తదితర వేదికలపై సాంస్కృతిక అంశాలలో శాస్త్రీయ నృత్యం బృందం, సోలో విచిత్ర వేషధారణ ఏకపాత్రాభినయం జానపద నృత్యం బృందం, సోలో జానపద గీతాలు ఆలాపన సోలో, బృందం సీనియర్స్ జూనియర్స్, చిన్నపిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్సెస్, అకడమిక్ అంశాలలో చిత్రలేఖనం, జనరల్ నాలెడ్జ్ క్విజ్, పద్యం – భావం, రైమ్స్, వ్యాసరచన తెలుగు, వ్యాసరచన ఇంగ్లిషు, కథలు చెప్పడం, తెలుగు లో కవితారచన, ఇంగ్లీష్ లో కవితారచన, క్లేతో బొమ్మలు బెస్ట్ ఫ్రం వేస్ట్, కార్టున్ వేయడం జ్ఞాపకశక్తి పరీక్షలు సీనియర్స్, జూనియర్స్, సబ్ జూనియర్స్ కేటగిరిలలో పోటీలు ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత వర్మ, డీఈవో ఇ.నారాయణ, కళాశాల డైరెక్టర్లు యం.జగపతి రాజు ప్రిన్సిపల్ కెవి మురళీకృష్ణంరాజు, కాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చింతలపాటి దిలీప్, బాలోత్సవం అధ్యక్షులు ఇందుకూరి ప్రసాదరాజు, ప్రధాన కార్యదర్శి సిహెచ్ పటాభిరామయ్య, కోశాధికారి పి సీతారామరాజు అసోసియేట్ అధ్యక్షులు గాతల జేమ్స్, పి శ్రీనివాసరాజు బి చైతన్య ప్రసాద్ , కే అశోక్ రాజు, కలిగొట్ల గోపాల శర్మ, చాంద్ బాషా ఎస్ ఎస్ ఎన్ రాజు , సిహెచ్ ఝాన్సీ, దాయన చంద్రాజీ కంతేటి వెంకట రాజు, గ్రంధి కుమార వెంకటేశ్వర వర ప్రసాద్, లక్ష్మి, సుబాన్, సూర్య, శిరీష, కే పాండురంగరాజు, గంధం శ్రీదేవి, ఎం నిర్మల, కళ్యాణి మంతెన కృష్ణంరాజు, పరిమి సూర్యనారాయణ సురేష్ కుమార్ ఏయూ భాస్కరరావు, చింతపల్లి ప్రసాదరావు. ఎస్ శిరీష్ తదితరులు పాల్గొన్నారు.