ఇంధనాన్ని పొదుపు చేసి భావితరాలకు వనరులను కాపాడాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు 2025 భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీo అస్మి చేతుల మీదుగా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు-2025 గోడ పత్రికను విద్యుత్ శాఖ ఇంజనీర్ల తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ డిసెంబర్ 14 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు బి ఇ ఇ వారి సౌజన్యంతో జరగనున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు మహోద్యమంగా నిర్వహించాలన్నారు. ప్రజల్లో ఇంధన పరిరక్షణ ఆవశ్యకత పై అవగాహన కల్పించాలని అన్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా అంతట పట్టణ, గ్రామాలలో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సంబంధిత శాఖ అధికారులు ఆదేశించారు. ఇంధనాన్ని పొదుపు చేసి భావితరాలకు వనరులను కాపాడాలన్నారు. విద్యుత్ వనరుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
ఈ సందర్భంలో జిల్లా విద్యుత్ శాఖ అధికారి పి.ఉషారాణి, విద్యుత్ శాఖ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.