అన్న క్యాంటీన్ లో ఆహార నాణ్యత, వసతులను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి
అన్న క్యాంటీన్ లో ఆహారం నాణ్యతతో కూడి, పరిశుభ్రమైన వాతావరణంలో అందించాలి…
గురువారం నరసాపురం స్టీమర్ రోడ్ లో ఉన్న అన్న క్యాంటీన్ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ ఆకస్మిక తనిఖీ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నా క్యాంటీన్లో నిర్వహణ, పరిశుభ్రత, ఆహార నాణ్యత, వసతులును పరిశీలించారు. భోజనం చేస్తున్న ప్రజలతో మాట్లాడారు, పలు సూచనలు ఇచ్చారు. స్వయంగా లబ్ధిదారులకు భోజనమును వడ్డించారు. స్వయంగా ఆయన భోజనము రుచి చూశారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన టూరిస్టులు అన్న క్యాంటీన్లో భోజనము చేస్తూ ఉండటం చూసిన జాయింట్ కలెక్టర్ వారితో మాట్లాడారు. భోజనము ఎలా ఉంది అని అడుగుగా బయట హోటల్లో ఒక భోజనము ఖర్చు 100 రూపాయలు అవుతుందని ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే క్వాలిటీతో రుచికరమైన భోజనము అందించటంపై సంతోషం వ్యక్తం చేశారు. క్యాంటీన్ నిర్వహణతో మాట్లాడుతూ రోజుకు ఎంతమంది భోజనము చేస్తూ ఉంటారని జాయింట్ కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పేదల కొరకు 5 రూపాయలకే నాణ్యతతో రుచికరమైన భోజనము అందించటం వంటి వాటిపై అవగాహన చేసుకోవాలన్నారు. స్వయంగా ఇక్కడ కొంతమంది భోజనం చేస్తూ కొంతమంది టూరిస్టులు కనిపించటం వారితో మాట్లాడటం జరిగిందన్నారు. భోజనం వేడివేడిగా క్వాలిటీగా ఉందని సర్వీస్ కూడా బాగుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారని అన్నారు. అన్నా క్యాంటీన్ నిర్వహణ సమయంలో మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. క్యాంటీన్లో లబ్ధిదారులకు వసతులు తోపాటు, పరిశుభ్రతను పాటించాలని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం అన్నా క్యాంటీన్ నిర్వహణ సమయంలో నిర్వహణ, పరిశుభ్రత, నీటి సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్యాంటీన్ లో చిన్న చిన్న మరమ్మతులను మున్సిపాలిటీ ద్వారా చేయడం జరిగిందని చెప్పారు. వర్షం వస్తే భోజనం చేసే ప్రజలు తడుస్తున్నారని జాయింట్ కలెక్టర్ కి నిర్వాహకులు తెలపగా మున్సిపాలిటీ ద్వారా ఒక షెడ్డును ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ని ఆదేశించారు. వచ్చిన వారందరికీ మంచి క్వాలిటీ ఫుడ్ ను అందించాలని సూచించారు.
ఈ సందర్భంలో ఆర్డీవో దాసిరాజు, మున్సిపల్ కమిషనర్ ఎం అంజయ్య, తహసిల్దార్ అయితం సత్యనారాయణ, సిబ్బంది, తదితరులు ఉన్నారు.