Close

పిజిఆర్ఎస్ లో వచ్చిన ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Publish Date : 18/11/2025

పిజిఆర్ఎస్ ఫిర్యాదుపై మంగళవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అర్జీదారులను స్వయంగా విచారించి పరిష్కరించడం జరిగింది. పూర్వపరాల్లోకి వెళితే వీరవాసరం మండలం నవుడూరు గ్రామం రావి సత్యవతికి చెందిన ఆస్తి విషయంలో వారి పెద్ద కుమారుడు రావి రాంబాబు ఆగస్టు 25,2025న ఫిర్యాదు చేయడం జరిగింది.

పూర్వపరాల్లోకి వెళితే రావి సత్యవతి తన భర్త సంపాదించిన ఆస్తి 1.36 సెంట్లు, అందులో 0.04 సెంట్లులో ఇల్లు ఉందని, తన ఆస్తిని తన పెద్ద కుమార్డు రావి రాంబాబుకు, చిన్న కుమారులు రావి పద్మనాభుడు, ఆంజనేయులు ఆక్రమించుకుని వృద్ధాప్యంలో నన్ను చూడటం లేదని, తల్లిదండ్రుల పోషణ మరియు సంక్షేమ ట్రిబ్యునల్ ద్వారా తగు న్యాయం చేయవలసినదిగా 2023వ సంవత్సరంలో ఫిర్యాదు చేసియున్నారు. ఈ విషయముపై భీమవరం ఆర్డీవో విచారణ చేసి అన్నదమ్ములు ముగ్గురు వారి తల్లిగారైన రావి సత్యవతి ఆలన పాలన చూసుకునే విషయంలో నిర్ల్యక్యం చేసి ఉన్నారు కనుక ఆ ఆస్తి వారి తల్లి గారైన రావి సత్యవతికి చెందేటట్లుగా 2023 ఏప్రిల్ లో ఉత్తర్వులను జారీ చేసి ఉన్నారు.

కాని ఇదే విషయంపై ఉత్తర్వులను పునః పరిశీలించమని కోరుచూ రావి రాంబాబు ఆగస్టు 25,2025న పి జి ఆర్ ఎస్ ఫిర్యాదు చేసియున్నారు. కానీ సీనియర్ సిటిజెన్ ట్రిబ్యునల్ ఆదేశాలు మార్పు చేర్పులకు నిబంధనలు ప్రకారం వీలు కాదని, ఈ విషయం లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే హైకోర్ట్ ను సంప్రదించి పరిష్కరించుకోవాల్సిందిగా భీమవరం ఆర్డీవో నవంబర్ 4,2025న ఎండార్స్మెంట్ ద్వారా తెలియజేయడం జరిగింది.

అయినను రావి రాంబాబు పి జి ఆర్ ఎస్ లో దరఖాస్తు చేశాను పరిష్కారం కాలేదు అనడంలో వాస్తవం లేదన్నారు. అధికారులు నిభంధనల ప్రకారమే పరిష్కరించడం జరిగిందని, ఈ విషయాన్ని ఫిర్యాదుదారులు తల్లి సత్యవతి, వారి ముగ్గురు కుమారులు సమక్షంలో జిల్లా జాయింట్ కలెక్టర్ స్వయంగా విచారించి కేసును పరిష్కరించడం జరిగింది. పెద్ద కుమారునికి ఇచ్చిన వాటా అద్దెకిచ్చి వేరే అద్దెకు వెళ్లవలసిందిగా, ప్రస్తుతం ఇంటి ఎదురుగా ఉన్న నడుపుచున్న జ్యూస్ షాపు నిబంధనల మేరకు ఉన్నది లేనిది పరిశీలించాల్సిందిగా ఈరోజు జిల్లా జాయింట్ కలెక్టర్ విచారణలో తహసిల్దారును ఆదేశించడం జరిగింది.

విచారణ కార్యక్రమంలో జిల్లా గ్రామ సచివాలయాల అధికారి వై.దోసిరెడ్డి, వయో వృద్ధుల సంక్షేమం ట్రిబ్యునల్ మెంబర్ మేళం దుర్గాప్రసాద్, వీరవాసరం తహసిల్దార్, ఫిర్యాదుదారుల కుటుంబ సభ్యులు, పాల్గొన్నారు.