Close

దేవాలయాల సందర్శన మాదిరిగా ప్రతి ఒక్కరూ గ్రంధాలయాలు సందర్శించి పుస్తక పఠనం అలవాటుగా చేసుకోవాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 16/11/2025

58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా డాక్టర్ వైయస్సార్ మెమోరియల్ ప్రధమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా గ్రంధాలయాలకు విశేష సేవ చేసిన అయ్యంకి వెంకట రమణయ్య , పాతురి నాగ భూషణం, ఎస్ ఆర్ రంఘనాథన్ చిత్రపటాల వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి పూల మాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మన సంస్కృతిలో భాగంగా మనం దేవాలయాలు, మసీదు, చర్చిలు సందర్శన మాదిరిగానే ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సందర్శించి పుస్తక పఠనం అలవర్చుకోవాలన్నారు. గ్రంథాలయాలు ఉన్నత స్థితికి రావాలంటే ప్రజలలో ముఖ్యంగా పిల్లలలో పుస్తక పఠనం మీద అవగాహన రావాలి అన్నారు. ఏదో ఒక పుస్తకం చదవుతూ ఉంటే జ్ఞానం పెరుగుతుంది అన్నారు. గ్రంథాలయాలకు వెళ్లి పుస్తక పఠనంపై ఆసక్తి పెరిగే విధంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రంథాలయానికి 4 లక్షల రూపాయల విలువైన వాటర్ ప్లాంట్, రెండు కంప్యూటర్స్, ప్రింటర్, ఇన్వర్టర్ సదుపాయం కల్పించిన తిరుమల విద్యాసంస్థలను జాయింట్ కలెక్టర్ అభినందించారు. ఈ గ్రంథాలయంలో చదువుకొని వివిధ పోటీ పరీక్షలలో విజయం సాధించిన 20 మందిని జాయింట్ కలెక్టర్ సన్మానించారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి ఎస్.వెంకటేశ్వర రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు వబిలిశెట్టి కనకరాజు, బలివాడ సాయి ప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు యేలేటి న్యూటన్, అల్లూరి నరసింహరాజు, కాలిగొట్ల గోపాలశర్మ, జి.నాగరాజు, వి వి వి న్ మూర్తి, ఎస్ కే బాబాసాహెబ్, అల్లు శ్రీనివాస్, గ్రంథాలయ సిబ్బంది విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.