నవంబర్ 30లోపు ఇళ్ల నిర్మాణాలకు దరఖాస్తులు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశంలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించిన సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాలలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు
జిల్లాలో పిఎంఏవై 1.0 కింద 6,600 గృహ నిర్మాణాలు పూర్తి
జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆకువీడు మండలం కుప్పనపూడిలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
అర్హులైన లబ్ధిదారులు గృహాల మంజూరుకు నవంబర్ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల సాకారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అర్హులైన లబ్ధిదారులు పిఎంఏవై 2.0 పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
నేడు రాష్ట్రవ్యాప్తంగా నూతన గృహప్రవేశాలను రాష్ట్ర ముఖ్యమంత్రిచే నిర్వహించిన సందర్భంగా, ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లాలోని ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామం తాళ్లకోడు లేఔట్ లో జిల్లా గృహ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొని, నూతన గృహప్రవేశాల లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర పభుత్వాలు ఇల్లు లేని పేద వారికి ఇల్లు మంజూరు చేయాలనే ఉద్దేశ్యంతో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తున్నదన్నారు. గృహ నిర్మాణాల కొరకు నవంబర్ 30 వరకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని, అర్హులైన లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలో పిఎంఏవై 1.0 కింద ఇప్పటి వరకు పూర్తి అయిన 6,600 గృహాలకు గృహ ప్రవేశ కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగిందని, నేడు 100 ఇళ్ల గృహప్రవేశాలను నిర్వహించడం జరిగిందన్నారు. ఇంకా ఇల్లు లేని వారిని పి ఎం ఏ వై 2.0 ద్వారా గుర్తించి 595 గృహాలు మంజూరు ఉత్తర్వులు అందజేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో హౌసింగ్ శాఖ ద్వారా ఇల్లు లేని అర్హులను గుర్తించి దరఖాస్తులు చేయించే కార్యక్రమం చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదవారికి ఇల్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపుతున్నాయన్నారు. ఇళ్ల మంజూరు కొరకు గ్రామ సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ద్వారా నవంబర్ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇల్లు లేని వారికి ఇల్లు మంజూరు చేయడం ద్వారా వారికి వారసత్వ ఆస్తి ఏర్పడుతుందని, తద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి.పిచ్చయ్య, డిఈ పి.శివరామరాజు, ఏఈలు కె.నాగేంద్ర, ఎమ్.ఎస్ అభితేజ్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ కె.శ్రీనివాసరావు, కుప్పనపూడి గ్రామ సర్పంచ్ ముత్యాల అనురాధ, ఇంచార్జి తహసిల్దార్ ఫరూక్, ఆకివీడు ఎక్స్ ఏఎంసీ చైర్మన్ మోతుపల్లి ప్రసాద్, ఉండి నియోజకవర్గం జెఎస్పి ఇంచార్జ్ జుత్తుగ నాగరాజు, ఎంపీపీ కటారి జయలక్ష్మి, ఎంపీటీసీ బంటుమిల్లి పుణ్యవతి, నగర పంచాయతీ చైర్మన్ జె.హైమావతి, ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, టిడిపి నాయకులు మద్దిశెట్టి త్రిమూర్తులు, బిజెపి నాయకులు కట్ రెడ్డి ఏడుకొండలు, కూటమి నాయకులు జన్ను గోపిరాజు, బండి కొండ, వెలగపల్లి అప్పులు, కోపల్లి సాయిబాబు, అల్లాడి బాలాజీ, ఎంవీఎస్ నాగమణి, పిల్లా బాబులు, గంధం ఉమా, ముత్యాల శివయ్య, గృహ నిర్మాణ శాఖ డిఈ, ఏఈలు, కాలనీ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.