ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయడానికి క్షేత్రస్థాయిలో అధికారులు నిబద్ధత పని చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు
మంగళవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఖరీఫ్2025-26 సీజన్ ధాన్యం కొనుగోలు, మరియు అర్హులైన వారి అందరికీ ఇల్లు, పిజిఆర్ఎస్, రీ సర్వే, సంబంధిత అంశాలపై, డిపిసి మెంబర్స్, ఆర్డీవోలు, పి ఎస్ సి ఎస్ లు, తాహ సిల్దార్లు ఎం ఎల్ ఓ లు మండల్ లెవెల్ కమిటీ సభ్యులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ 2025-26 సీజన్ కు జిల్లాలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయుటకు గాను1 కోటి 25 లక్షలు గన్ని బ్యాగులు అవసరం ఉండగా 50 శాతం గన్ని బ్యాగులను ఆర్డీవోలు, పి ఎస్ సి ఎస్ లు, తహసిల్దార్లు, పర్యవేక్షణలో మిల్లర్స్ వద్ద తీసుకొని రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
రెండు మూడు రోజుల్లో గన్ని సేకరణంత పూర్తి చేసి రైతు సేవా కేంద్రాల్లో 50 శాతం అందుబాటులో ఉంచాలని అన్నారు. రవాణా కొరకు ఇప్పటివరకు 2,300 వాహనములు రిజిస్ట్రేషన్ అయి ఉండగా ఇంకా 700 వాహనాలములను రిజిస్ట్రేషన్లు త్వరగా పూర్తి చేయాలని రవాణా శాఖ అధికారిని ఆదేశించారు. కస్టోడియంలో మిల్లులు వద్ద ఉండేలా చర్యలు తీసుకుని రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు.
సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్ పెండింగులు త్వరగా ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు. అందరికీ ఇల్లు స్కీములో ఇప్పటి వరకు అర్హులైన 4,500 మంది దరఖాస్తులు సంబంధించి పాత లేఅవుట్ లో ఖాళీగా ఉన్నచోట ఏర్పాటు చేయాలని అన్నారు. ఎంతవరకు సర్దుబాటు చేయగలము మ్యాపుల్లో గుర్తించి జిల్లా రెవెన్యూ అధికారికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. పాత లేఔట్ లో సర్దుబాటు కానీ లబ్ధిదారులకు ఊరికి దగ్గరలో ఇల్లు కట్టుకొనుటకు భూములు సేకరించి ప్రతిపాదనలు పంపాలని అన్నారు. పిజిఆర్ఎస్ పెండింగు పిటిషన్లు సంబంధిత అధికారులు క్వాలిటీతో పరిష్కరించాలని సూచించారు ఆర్డీవోలు తహసిల్దార్లు ఆడిట్ చేయాలని సంబంధిత పిటిషన్ దారులతో మాట్లాడి పరిష్కారం చేసిన విధానమును తెలియజేయాలి అని సూచించారు.
జిల్లాలో ఉండి వీరవాసరం నరసాపురం ఎలమంచిలి మండలాల్లో రీ సర్వే గ్రౌండ్ ట్రూ థింగ్ జరిగే ఐదు గ్రామాలు లో ఒక్కొక్క టీము రోజుకు 25 ఎకరాలు రీ సర్వే చేసేలా ఆర్డీవోలు మండల సర్వేలు తాసిల్దార్లు పర్యవేక్షించాలి అన్నారు. రైతులకు నోటీసులు ఇచ్చి డాక్యుమెంట్లు పరిశీలించే సర్వే పూర్తి చేయాలన్నారు. రీ సర్వే ఫేస్ 2 లో జున్నూరు, మార్టేరు గ్రామాలు రికార్డును జిల్లా జాయింట్ కలెక్టర్ వారికి పరిశీలన కొరకు సమర్పించాలని ఆదేశించారు. రీ సర్వే ఫేస్ 1 సంబంధించి మండలానికి ఒక గ్రామం చొప్పున తీసుకుని రీ సర్వే పూర్తి అవగానే 22 a మరియు రైతుల వ్యక్తిగత సమాచారం ఆన్లైన్ లో పొందుపరిచి శనివారం లోగా జిల్లా జాయింట్ కలెక్టర్ కు దాఖలు చేయాలని అన్నారు. తదనంతరం అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన రైతులకు రిజిస్ట్రేషన్ మార్గం సులభతరం అవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు.
గూగుల్ మీట్ సమీక్ష సమావేశంలో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా సర్వే అధికారి కె.జాషువా , సెక్షన్ డిప్యూటీ తాసిల్దార్ మారాపు సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.