Close

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 08/11/2025

సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ నడక, సైక్లింగ్, యోగాకు కొంత సమయం కేటాయించాలి.

“ఫిట్ ఇండియా” కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం విష్ణు కళాశాల వద్ద “ఫిట్ ఇండియా – సైక్లోథాన్” కార్యక్రమానికి జెండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ విష్ణు కాలేజీ నుండి జువ్వలపాలెం అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు ఐదు కిలోమీటర్ల మేర కొనసాగింది.

ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు స్వయంగా సైకిల్ తొక్కి చివరివరకు సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నేడు “ఫిట్ ఇండియా – సైక్లోథాన్” సైకిల్ ర్యాలీని నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతినెలా శారీరక దారుద్యానికి ఏదో ఒక కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం జరుగుతుందన్నారు. జిల్లా అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణలో ఒత్తిడికి గురవుతారని, ఒత్తిడిని తగ్గించుకోవడానికి నడక, 2 కె రన్, యోగ, సైక్లింగ్ వంటి కార్యక్రమాలను ప్రతినెల ఒక రోజున నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ హాజరై తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలన్నారు. నడక, సైక్లింగ్ యోగ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారి సూచనల మేరకు ప్రతి నెల ఒకరోజు నడక, సైక్లింగ్, యోగ ఏదో ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణ ద్వారా అధికారులు, సిబ్బందికి మంచి ఆరోగ్యం కలుగుతుందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజలలో ఆరోగ్యంపై అవగాహన కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఏ.రాంబాబు, డిఇఓ ఈ నారాయణ, డిపిఓ ఎం.రామనాథరెడ్డి, భీమవరం డీఎస్పీ , నర్సాపురం డి.ఎస్.పి డా.శ్రీ వేద, ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ, భీమవరం తహసిల్దార్ రావి రాంబాబు, పోలీస్, రెవిన్యూ అధికారులు, సిబ్బంది, కళాశాలల, పాఠశాలల, విద్యార్థులు, తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.