Close

విభిన్న ప్రతిభావంతులు మూడు చక్రాల మోటార్ వాహనాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు

Publish Date : 06/11/2025

శారీరక వైకల్యం కలిగిన వారు మేరకు మూడు చక్రముల మోటార్ వాహనాలకై www.apdascac.ap.gov.in ఆన్ లైన్ ద్వారా నిబంధన మేరకు దరఖాస్తు చేయాలని సూచించారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న అనంతరం సంబంధిత ధ్రువపత్రాలతో కలిపి దరఖాస్తును నవంబర్ 25 లోపుగా సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ కార్యాలయము నందు అందజేయాలన్నారు. దరఖాస్తుదారుని వయసు నవంబర్ 25,2025 నాటికి 18 నుండి 45 సంవత్సరముల మధ్య ఉండాలన్నారు. శారీరక వైకల్యం ఒకటి లేదా రెండు క్రింది భాగాలు ప్రభావితమై 70% లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నవారు అర్హులన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం రు.3 లక్షలకు మించి ఉండకూడదని, దరఖాస్తుదారుడు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారే అయి ఉండాలని తెలిపారు. వారికి అనువైన వాహనము నడుపుటకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి యుండాలని, ప్రభుత్వము లేదా ప్రైవేటు సంస్థల ద్వారా ఇంతకు ముందు ఏ మోటరైజ్డ్ వాహనాన్ని పొంది ఉండకూడదని తెలిపారు. గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే పై స్థాయి కోర్సులు రెగ్యులర్ పద్ధతిలో చదువుచున్న విద్యార్ధులు, స్వయం ఉపాధి, వ్యవసాయం & అనుబంధ రంగాలు లేదా కనీసం 10వ తరగతి విద్యార్హతతో ఒక సంవత్సరం అనుభవం ఉన్న జీతం/వేతనం పొందుతున్న ఉద్యోగులు అర్హులని తెలిపారు. దరఖాస్తుతో పాటు సెల్ఫ్ అటెస్టేడ్ ధ్రువ పత్రములు, జిల్లా మెడికల్ బోర్డు ద్వారా జారీచేసిన సదరం ధ్రువ పత్రము, ఆధార్ కార్డు, పదవ తరగతి మరియు ఆ పై విద్యార్హతలకు సంబందించిన ధృవీకరణ పత్రములు, షెడ్యూల్ కులముల/షెడ్యూల్ తెగలు వారైనచో కుల ద్రువీకరణ పత్రము, తాజా ఆదాయ ధ్రువ పత్రము, విద్యార్ధుల కోసం బోనఫైడ్ సర్టిఫికెట్/ స్వయం ఉపాధి లేదా ఉద్యోగుల కోసంఉపాధి ధ్రువ పత్రము, పూర్తిగా మనిషి కనపడేలా తీయించుకున్న పాస్ పోర్ట్ సైజు ఫొటో, ఇంతకూ ముందు వాహనము పొందలేదని స్వీయ ప్రకటన జత పరచాల్సి ఉంటుందని తెలిపారు. ఆసక్తి కలిగిన శారీరక దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.