Westgodavari
చదువు కోవటం ఒక్కటే మీ బాధ్యత భవిష్యత్తు లక్ష్యాలను సాధించాలి
నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం నక్కావారి పేటలో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకు ల పాఠశాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తరగతి గదులను స్వయంగా పరిశీలించి విద్యార్థులతో కొద్ది సమయం ముచ్చటించారు. బాగా చదువుతున్నారా, సబ్జెక్టు టీచర్లు ఉన్నారా, పదవ తరగతి అనంతరం ఏ కోర్సు చేయాలనుకుంటున్నారు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాల్యంలో చదువుకోవటం ఒక్కటే మీకు ఉన్న బాధ్యత అని, బాగా చదువుకోవాలన్నారు. ఇతర వ్యాపకాలకు దూరంగా ఉండాలని హితువు పలికారు. చదువుకునే వయస్సులో సెల్ ఫోన్లు చూసుకుంటూ సోషల్ మీడియాకు ఆకర్షితులయితే భవిష్యత్తు లక్ష్యాలను సాధించలేరని, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదువుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే ఆడపిల్లలు తన కాళ్ళపై స్వశక్తితో నిలబడగలరని మంచి భవిష్యత్తును పొందగలరని సూచించారు.