Close

రాష్ట్రంలోనే మొట్టమొదటి ఖరీఫ్ సీజన్ కొనుగోలు కేంద్రం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రారంభం..

Publish Date : 03/11/2025

గతంలో ఎన్నడూ లేనివిధంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు..

కౌలు రైతులకు నూరు శాతం సబ్సిడీపై 50వేల తార్పలిన్లు ఉచితంగా అందజేస్తాం..

కౌలు రైతును ఆదుకునేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నాం..

గన్ని బ్యాగులు ఎక్కడ కొరత లేకుండా అధికారులు చూడాలి.. ధాన్యం మిల్లుల తరలింపుకు 36 వేల వాహనాలను ఏర్పాటు చేశాం

ఫిర్యాదుకు 1967 కాల్ చేయాలి, 7337359375 నెంబర్ వాట్సప్ లో హాయ్ పెట్టి మీకు నచ్చిన తేదీ, సమయంలో అమ్మకాలు చేయవచ్చు.

ధాన్యం కనుగోలు చేసిన 24 గంటల లోపుగా నగదు జమ చేయడానికి చర్యలు తీసుకున్నాం..

ఇన్పుట్ సబ్సిడీకి, ధాన్యం కొనుగోలుకు సంబంధం లేదు…

అభివృద్ధి, సంక్షేమం రెండు జరగాల్సిందే.. పల్లె పండగ పేరుతో 34 వేల కిలోమీటర్ల రోడ్లను నిర్మించుకున్నాం…

గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాందేడ్ల మనోహర్ వెల్లడించారు

సోమవారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలనులో రాష్ట్రంలోనే మొట్టమొదటి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతులను నూటికి నూరు శాతం ఆదుకుంటామని ఎవరు అధైర్య పడవద్దు అన్నారు. గత రబీ సేవలను సీజన్లో కూడా పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేసి నిర్ణీత గడువు కంటే ముందుగానే ధాన్యం నగదును జమ చేయడం జరిగింది అన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు కూడా కోట్లాది రూపాయలను రైతులకు బకాయిలు పెట్టి రైతులను ఇబ్బంది పెట్టిందని, కూటమి ప్రభుత్వం రాగానే రూ.1,674 కోట్లాది రూపాయల బకాయిలను రైతులకు జమ చేయడం జరిగిందని, అలాగే రూ.400 కోట్ల రూపాయలు బకాయిలను మిల్లర్లకు చెల్లించడం జరిగిందన్నారు. కౌలు రైతులు ఎక్కువమంది ఉన్నారని వారు నష్టపోకుండా ఏ విధంగా ఆదుకోవాలనేది ఆలోచన చేస్తున్నామని, తప్పకుండా కౌలు రైతులను ఆదుకుంటామన్నారు. కౌలు రైతులకు నూరు శాతం సబ్సిడీపై 50 వేల తార్పాలిన్లను ఉచితంగా అందచేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అవసరమైన గన్ని బ్యాగులను సిద్ధం చేయడం జరిగిందని, ఎక్కడ గన్ని బ్యాగులు కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యాన్ని వేగవంతంగా మిల్లులకు తరలించేందుకు 34 వేల వాహనాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం రేషన్ పంపిణీకి 9 వేల వాహనాలను రూ.1,600 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసి నిత్యవసర వస్తువుల సరఫరాని ఇంటి వద్దకే అనేది చేయడంలో విఫలమైందని, నేడు రాష్ట్ర వ్యాప్తంగా 29,750 రేషన్ షాపులను తెరిచి లబ్ధిదారులు ఏ సమయంలోనైనా రేషన్ పొందేందుకు అవకాశాన్ని కల్పించడం జరిగిందన్నారు. ఏమి చేస్తున్నారు. రానున్న రోజుల్లో గిరిజన సొసైటీల ద్వారా, ఆర్గానిక్ ఉత్వత్తులు పండించే రైతుల ద్వారా రేషన్ దుకాణాలకు అవసరమైన సరుకుని లబ్ధిదారులకు అందజేయనున్నట్లు తెలిపారు. స్థానిక శాసనసభ్యులు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ప్రజా సమస్యల పైన ప్రజలు కోరుకుంటున్న అంశాల పైన నిర్భయంగా పోరాటం చేసే వ్యక్తి మన బొలిశెట్టి శ్రీనివాస్ అని కొనియాడారు. ఈరోజున 12 వేల సిబ్బందితో 34 వేల ట్రాక్టర్లు లారీలు తో దాదాపు నాలుగు వేల రైతు సేవ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. భారతదేశంలోనే మొట్ట మొదటిసారి వాట్సాప్ ద్వారానే మీరు కోరుకొన్న మిల్లుకు, నచ్చిన తేదీల్లో దాన్ని అమ్ముకునేందుకు సాంకేతికతను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుందని అందరూ సహకరించాలని ఇంత భారీగా జరుగుతున్న ఈ ప్రక్రియలో చిన్న చిన్న ఉంటాయి దయచేసి క్షేత్రస్థాయిలోని అధికారులు ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేయాలన్నారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ధాన్యం అమ్మిన రైతులకు ఏ విధమైన జాప్యం లేకుండానే 24 గంటల్లోనే వారికి డబ్బు జమ కావడం జరుగుతుందని రైతుల తరఫున నేను ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నారు. జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలును నిర్ణయించడం జరిగిందని, అంచనాలకు మించి దానం కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే దాన్ని కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు.

తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు వెంటనే ధాన్యం జమ చేయడం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమైంది అన్నారు. గతంలో ఆరుగలం పండించిన రైతు దాన్ని అమ్మిన డబ్బులు ఎప్పుడు వస్తాయో అని ఎదురుచూసే పరిస్థితి ఉండేదని నేడు అది లేదన్నారు. తాడేపల్లిగూడెంలో రహదారులు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి. రహదారుల సమస్యను పరిష్కరించాలని సందర్భంగా కోరారు.

కార్యక్రమంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ విసి అండ్ ఎండి ఢిల్లీ రావు, డైరెక్టర్ ఆర్.గోవిందరావు, చైర్మన్ తోట మెహర్ సీతారామ సుధీర్, శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, సిరి బాలరాజు, సొంగ రోషన్ కుమార్, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జెఎస్పి జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు, బిల్డింగ్ అసోసియేషన్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జి, ఆరుగొలను సర్పంచ్ పి బుచ్చిబాబు, సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ ఎండి ఇబ్రహీం, అగ్రికల్చర్ జెడి జెడ్ వెంకటేశ్వరరావు, డీఎస్ఓ సరోజ, డి సి ఓ ఎస్ మురళీకృష్ణ, ఏడిఏ ఆర్ గంగాధర్ రావు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.