Close

దీర్ఘకాలంగా బ్యాంకు లావాదేవీలు నిర్వహించని ఖాతాదారులు తమ బ్యాంకు అకౌంట్లు పునరుద్ధరణ లేదా నగదు వాపస్ తీసుకోవడానికి ఆర్బిఐ వెసులుబాటు కల్పించింది–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Publish Date : 03/11/2025

మీ డబ్బు…. మీ హక్కు అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎల్ డి ఎం నాగేంద్రప్రసాద్, డిఆర్ఓ బి. శివన్నారాయణ రెడ్డి చేతుల మీదగా గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, పోస్ట్ఆఫీస్ ఖాతాలలో నిరుపయోగంగా ఉన్న డిపాజిట్లు, ఖాతాలను పునరుద్ధరించుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవకాశం కల్పించిందన్నారు. లీడ్ బ్యాంకు ద్వారా ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆర్బిఐ సూచించింది అన్నారు. ఈ అవగాహన కార్యక్రమాలు డిసెంబర్ 2025 వరకు మండల, గ్రామస్థాయిలో నిర్వహించడం జరుగుతుందన్నారు. సంవత్సరాల నుండి 10 సంవత్సరాలు వరకు ఎటువంటి లావాదేవీలు జరపని ఖాతాలకు సంబంధించి తమ బ్యాంకు శాఖలకు వెళ్లి అకౌంట్ పునరుద్ధరణ లేదా డబ్బు తీసుకోవచ్చు అన్నా రు. ఈ సందర్భంగా ఆధార్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి సమర్పించాలన్నారు. లావాదేవీలు నిర్వహించని బ్యాంకు ఖాతాలలో సొమ్ము వివరాలు తెలుసుకోవడానికి https://udgam.rbi.org.in లో లాగిన్ ద్వారా తమ, తమ బ్యాంకు ఖాతాలలో ఎంత మేర సొమ్ము ఉన్నది తెలుసుకోవచ్చు అన్నారు.

జిల్లాలో వివిధ బ్యాంకుల్లో దీర్ఘకాలంగా లావాదేవీలు జరపని ఖాతాలలో 87 కోట్లు రూపాయలు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్, ఇన్సూరెన్స్ లు సంబంధించిన ఖాతాలలో మరో 20 కోట్ల రూపాయలు ఉన్నాయన్నారు. ప్రజలు ఆర్బిఐ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిరుపయోగంగా ఉన్న ఖాతాల పునరుద్ధరణ లేదా సొమ్ము తీసుకొనే అవకాశం ఉందన్నారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.