Close

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 03/11/2025

పిజిఆర్ఎస్ లో అందిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలి.

సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి ఎం.రామనాథరెడ్డి, గ్రామ వార్డు సచివాలయం అధికారి వై.దోసి రెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ రోజు వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజలనుంచి 232 అర్జీలు అందాయి.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. పిజిఆర్ఎస్ లో ప్రజలు సమర్పించిన అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఫిర్యాదు దారులతో స్వయంగా మాట్లాడి నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలన్నారు. శాఖల వారీగా వచ్చిన అర్జీలను పరిశీలించి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. అర్జీల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అర్జీలు రీఓపెన్‌కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు.

ఈరోజు పిజిఆర్ఎస్ కు అందిన ఫిర్యాదులలో ముఖ్యమైనవి కొన్ని ఈ విధంగా ఉన్నాయి.

@కాళ్ల మండలం దొడ్డనపూడి గ్రామానికి చెందిన చిన్నం చిరంజీవి అర్జీ సమర్పిస్తూ, తనకు 1.81 సెంట్లు భూమి ఉందని, పట్టాదార్ పాస్ బుక్ కొరకు దరఖాస్తు చేయగా వీఆర్వో, తహసిల్దార్ పాస్ బుక్ జారీలో కాలయాపన చేస్తున్నారని దయచేసి పాస్ బుక్ ఇప్పించాలని కోరారు.

@తణుకు పురపాలక సంఘం 7వ వార్డు ప్రజలు అర్జీని సమర్పిస్తూ, గత పది సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నామని, పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నామని వార్డువాసులకు తాగునీటి సదుపాయం, రోడ్డు సౌకర్యం లేదన్నారు.వర్షం పడితే రాకపోకలకు చాలా ఇబ్బంది పడుతున్నామన్నారు. దయచేసి మంచినీటి సదుపాయాలు కల్పించి, రోడ్డు నిర్మించాలని కోరారు.

@ భీమవరం మండలం గొల్లవాని తిప్పకు చెందిన కొయ్యలగడ్డ ఎర్ని రామలక్ష్మి అర్జీని సమర్పిస్తూ తన కుమారుడు పుట్టుకతోనే మానసిక వికలాంగుడని పించెను మంజూరు చేయాలని కోరారు.

@మొగల్తూరు మండలం, పేరుపాలెం గ్రామానికి చెందిన పితాని శ్రీదేవి తనకు 2.34 సెంట్ల భూమి ఉందని ఇటీవల చేసిన సర్వేలో 0.14 భూమి తగ్గిందని నా భూమిని కొలిపించి తగ్గిన 0.14 సెంట్లు భూమి అప్పగించాలని అర్జీ సమర్పించారు.

@ భీమవరానికి చెందిన కె.వెంకటరమణ అర్జీ సమర్పిస్తూ, తన భర్త 2023లో చనిపోయారని జీవనాధారం లేక ఇబ్బందులు పడుతున్నానని వితంతు పెన్షన్ మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు.

ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వయోవృద్ధుల సంక్షేమ ట్రిపునల్ సభ్యులు మేళం దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

3.11