Close

పశ్చిమగోదావరి జిల్లాలోని నలుగురు ఉద్యోగులు మొంథా తుఫాన్ రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపిక…

Publish Date : 03/11/2025

రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డులు అందజేత..

ప్రత్యేకంగా అభినందించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

మొంథా తుఫాన్ సమయంలో సంసిద్ధత, సహాయ కార్యకలాపాలలో అంకితభావం, నాయకత్వం, అవిశ్రాంత కృషికి గుర్తింపుగా రాష్ట్రస్థాయి ఎంపికలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నలుగురు ఉద్యోగులను ఎంపిక చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నవంబర్ ఒకటిన విజయవాడలో అవార్డుల ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా అధికారుల కరతాళ ధ్వనుల మద్య జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అవార్డు గ్రహీతలను ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మొంథా తుఫాన్ సమయంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చాయని కితాబ్ ఇచ్చారు. అన్ని శాఖలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అన్ని శాఖలు సమాంతర సేవలను అందించినను తీర ప్రాంతంలో విశిష్ట సేవలను అందించిన మూడు శాఖల ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి అవార్డులను ప్రధానం చేయడం జరిగిందన్నారు. వీరు సవాలుతో కూడిన సమయంలో పౌరుల భద్రత, శ్రేయస్సును నిర్ధారించడంలో వీరి నిబద్ధత, సామర్థ్యం, కరుణకు గుర్తింపుగా, ప్రజా సేవ యొక్క అత్యున్నత ప్రమాణాలకు ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదర్శప్రాయమైన సహకారానికి హృదయపూర్వక ప్రశంసలు, కృతజ్ఞతలను తెలియజేస్తూ అవార్డును అందజేయడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని శాఖలు భవిష్యత్తులో భవిష్యత్తు ఇదే సహకారంతో పనిచేసి జిల్లాకు మరింత పేరు తెచ్చేలా పనిచేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు.

అవార్డులు పొందిన వార్డులో .. పంచాయతీరాజ్ శాఖ ఈఈ సత్యనారాయణ, ఏఈ నాగేశ్వరరావు, మత్స్య శాఖ ఏడి ఎల్ ఎల్ ఎన్ రాజు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ తాడి లోకేష్ అన్నారు.

1.11 1.221.33