Close

మీకు పెట్టే భోజనమే నేను తింటా.. మీతోనే మేము.. ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Publish Date : 29/10/2025

కలెక్టర్ అమ్మ.. తుఫాన్ బాధితులతో సహపంక్తి భోజనం… కుశల ప్రశ్నలు..

ప్రజలకు ఏ ఆపద వచ్చిన ప్రభుత్వం అండగా నిలుస్తుంది …

పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని ఆరా..

నరసాపురం మండలం పెద్దమైన వానిలంక డిజిటల్ భవన్, వేముల దీవి మత్స్యకార బాలుర బీసీ వెల్ఫేస్ స్కూల్, మొగల్తూరు కేపీ పాలెం తుఫాన్ రక్షిత భవనంలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాల సందర్శన, ఆశ్రయం పొందిన వారితో ఏర్పాట్లపై ఆరా..

తుఫాను తీరం దాటిన అనంతరం చర్యలలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నరసాపురం, మొగల్తూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పలు పునరావాస కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు
తొలుత జిల్లా కలెక్టర్ నరసాపురం మండలం డిజిటల్ భవన్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి, ఆశ్రయం పొందిన వారిని ఆప్యాయంగా పలకరించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పునరావాస కేంద్రంలో అన్ని ఏర్పాట్లు బాగున్నాయా, భోజనం ఎలా ఉంది, మా అధికారులు బాగానే స్పందిస్తున్నారా తదితర వివరాలను తెలుసుకున్నారు. బాధితులకు భోజనాన్ని స్వయంగా వడ్డించి కలెక్టర్ కూడా వారితో పాటు కూర్చుని వారు తినే పదార్థాలనే ఆమె కూడా భుజించడంతో వారిలో ఒకింత ఆశ్చర్యం, ఒకింత మనోధైర్యం కనిపించాయి. భోజనం చేస్తూనే బాధితులతో యోగక్షేమాలు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలు అనే తారతమ్యం లేదని, ప్రభుత్వం ఎల్లప్పుడు మీకు అండగా ఉంటుందని తెలిపారు. ఏ సమస్య ఉన్నా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చు అన్నారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మీ నిర్మలమ్మ మీ గ్రామం పై ప్రత్యేక శ్రద్ధతో అనేక కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేస్తున్నారని, త్వరలో సముద్రపు కోత అడ్డుకట్ట నిర్మాణం కూడా పూర్తి కావస్తుందని, తుఫాన్లు సమయంలో భయపడవలసిన అవసరం ఉండదని ధైర్యం చెప్పారు. పెద్దమైన వాని లంక వద్ద ఒక కిలోమీటర్ పరిధిలో నిర్మిస్తున్న సముద్ర కోత అడ్డుకట్ట నిర్మాణాన్ని స్వయంగా పరిశీలించారు. సంబంధిత ఏజెన్సీ ప్రతినిధితో మాట్లాడి పనులు ఎప్పటికీ పూర్తి అవుతాయి, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ నాటికి ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణం పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం వేముల దీవి మత్స్యకార బాలుర బీసీ వెల్ఫేస్ స్కూల్ లో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా తొలగేంత వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని తెలిపారు. తదుపరి మొగల్తూరు కేపీ పాలెం తుఫాన్ రక్షిత భవనంలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి ఆశ్రయం పొందిన వారితో ఏర్పాట్లపై ఆరా తీశారు. అక్కడ ఏర్పాటుచేసిన మెడికల్ లో సిబ్బందితో మాట్లాడుతూ పాముకాటు కేసులు ఏమైనా వచ్చాయా, అన్ని మందులు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆశ్రయం పొందిన బాధితులతో మాట్లాడుతూ ఇంటికి వెళ్ళిన తర్వాత కాచి చల్లార్చిన నీటిని తాగాలని, పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. భిన్నమైన వాతావరణంలో అంటువ్యాధులు సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉందని జాగ్రత్త వహించాలని తెలిపారు. మార్గం మధ్యలో ఎన్టీఆర్ బృందాలను కలుసుకొని వారి సేవలను అభినందించారు.

ఈ సందర్భంలో నరసాపురం ఆర్టీవో దాసిరాజు, తహసిల్దార్లు ఐతం సత్యనారాయణ, రాజ్ కిషోర్, అనిత కుమారి, ఎస్.ఎం ఫాజిల్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి.శ్రీనివాసరావు, జిల్లా ఆర్ఎంపీ అధికారి శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, రెవిన్యూ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

2.22 2.11