మొంథా తుఫాన్ తీరం దాటినట్లు ప్రకటించిన నరసాపురం మండలం బియ్యపు తిప్ప ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
చిన్నమైనవాని లంక నల్లిక్రిక్ ఉప్పొంగి, రోడ్డు కోతకు గురై గండిపడిన ప్రాతం సందర్శన ..
నల్లిక్రిక్ గండి కారణంగా చుట్టుపక్కల సుమారు 1200 వందల ఎకరాలలో ఉప్పునీటి రొయ్యల చెరువులు గట్టులు తెగి జలసంద్రం …
వేముల దేవి ఈస్ట్ వెస్ట్ కుక్కిలేరు వద్ద గట్ల పైనుండి పొంగి కొంతమేర కరుణానగర్ కాలనీలోని చొచ్చుకు వచ్చిన నీటిని పరిశీలించి, బాధితుల పరామర్శ…
బుధవారం తెల్లవారుజామున తీరం దాటిన మొంథా తుఫాన్ కారణంగా నరసాపురం మండలంలో దెబ్బ తిన్న పలు గ్రామాలలో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంలో నరసాపురం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ ఉన్నారు. ఆక్వా రైతులను, బాధితులను పరామర్శించారు. నరసాపురం మండలం చిన్నమైనవాని లంక వద్ద నల్లిక్రిక్ ఉప్పొంగి రోడ్డు కోతకుగురై గండిపడిన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ స్వయంగా సందర్శించి రైతులతో మాట్లాడారు. సుమారు 1200 ఎకరాల విస్తీర్ణంలో చెరువులు పూర్తిగా నీటమునిగి దెబ్బతిన్నాయని రైతులు కలెక్టర్ కు తెలిపారు. ఈ విషయంమై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. వేముల దేవి ఈస్ట్ వెస్ట్ కుక్కిలేరు వద్ద గట్టు పైనుండి నీరు పొంగి కొంతమేర కరుణానగర్ కాలనీలోని చొచ్చుకు వచ్చిన నీటిని పరిశీలించి, బాధితులను పరామర్శించారు. జిల్లా యంత్రంగా పునరావాస కేంద్రానికి తరలిరమ్మన్నపుడు ఎందుకు వెళ్లలేదని ప్రశించారు. ఏదైన జరిగితే పరిస్థితి ఏంటి అని కాలనీ వాసులని నిలదీశారు. మొంథా తుఫాన్ తీరం దాటినట్లు ప్రకటించిన నరసాపురం మండలం బియ్యపు తిప్ప గ్రామం ప్రాంతాన్ని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దెబ్బతిన్న ప్రాతి ఒక్కరిని ఆదుకోవడం జరుగుతుంది, ఏ విధమైన ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంలో నరసాపురం ఆర్డీవో దాసిరాజు, తహసిల్దార్ ఐతం సత్యనారాయణ, మత్స్య శాఖ ఎడి ఎల్. ఎల్.ఎన్.రాజు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి.శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.