“మొంథా తుపాను” ఎదుర్కొనేందుకు అధికారులందరూ 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి.
జిల్లాలో ఏ ఒక్క ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి.
తుఫాను అనంతరం పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి.
సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
….జిల్లా ఇన్చార్జి మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
కేంద్రం ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ.
మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశం సమావేశ మందిరంలో “మొంథా తుపాను” సందర్భంగా జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలపై జిల్లా అధికారులతో సమీక్షించారు.
ఈ సమీక్షలో కేంద్రం ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ హాజరై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు..
ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు , తదితరులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలో తుఫాను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలను శాఖల వారీగా మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ తాను, కేంద్రం ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తో కలిసి నరసాపురం ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించానని యంత్రాంగం తీసుకొని చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. బియ్యపుతిప్ప, వేముల దీవి గ్రామాలకు చెందిన ప్రజలను అవసరమైతే నరసాపురం పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే విద్యుత్ సమస్యలు తలెత్తుతాయో అక్కడ ఎలక్ట్రికల్ పోల్స్, సిబ్బందిని, వాహనాలను ముందుగానే సిద్ధంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈదురు గాలులు వల్ల కరెంటు తీగలు తెగిపోవడం ద్వారా ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సరఫరా నిలుపుదల, హెచ్చుతగ్గులపై ప్రజలకు ఎస్ఎంఎస్ మెసేజ్ లు, కేబుల్ టీవీ ల ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నారు పునరావాస కేంద్రాల వద్ద పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తాగునీరు, ఆహారం, వైద్య సహాయం అందించేందుకు ఏర్పాటు చేయాలన్నారు. తుఫాన్ అనంతరం పునరావాస కేంద్రాలుగా ఉపయోగించిన భవనాలు, పాఠశాలలను పూర్తిస్థాయిలో శుభ్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. తుఫాను తీరం దాటే వరకు 24 గంటలు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డిపిఓ ఎం.రామనాథరెడ్డి, సిపిఓ కె.శ్రీనివాసరావు, డిఎంహెచ్వో గీతాబాయి, వివిధ శాఖల శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.