Close

పెద్దమైన వాని లంక గ్రామస్తులకు పీఎంఏవైజి పథకం కింద 78 మంది లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 24/10/2025

గల్ఫ్ కి వెళ్లి మోసపోతున్న మహిళలకు అండగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుకు చర్యలు

ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి

నైపుణ్య అభివృద్ధి శిక్షణ కోర్సులు నిర్వహణకు నరసాపురంలో భవనాన్ని పరిశీలించాలి

జిల్లాలో చాలా మంది మహిళలు సరైన అవగాహన లేక గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోతున్నారని, వారికి అండగా నిచ్చేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించి అమలకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పెద్దమైన వాని లంక డిజిటల్ భవనాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండి అండ్ సీఈవో గుమ్మల గణేష్ కుమార్ జిల్లా కలెక్టర్ ను కలిసి డిజిటల్ భవనంలో కొనసాగుతున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లా నుండి ఎంతోమంది మహిళలు సరైన అవగాహన లేక గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోతున్నారని, వీరికి అండగా నిలిచేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీనికి సంబంధించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించి అమలకు చర్యలు తీసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారిని ఆదేశించారు. గల్ఫ్ కి వెళ్లే ప్రతి ఒక్కరి పూర్తి వివరాలను రిజిస్టర్ చేయాలన్నారు. ఇలా చేయడం వల్ల మధ్యవర్తులు, ఏజెంట్లు బారిన పడకుండా నిరోధించడానికి వీలవుతుందన్నారు. సముద్రతీర ప్రాంతంలోని మత్స్యకార ఎస్ హెచ్ జి మహిళలకు సముద్రపు నాచు సాగుపై శిక్షణను అందించడం జరిగిందని, దీని ద్వారా అదనపు ఆదాయాన్ని అర్జించేందుకు అవకాశాన్ని కల్పించడం జరిగిందని స్కిల్ డెవలప్మెంట్ సీఈఓ కు వివరించారు. ఐటిఐ., పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని ఈ దిశగా యువతను ప్రోత్సహించాలని సూచించారు. డిజిటల్ భవన్ లో శిక్షణా తరగతులు నిర్వహించినట్లే మరికొన్ని శిక్షణలను ఇచ్చేందుకు నరసాపురంలో అనువుగా ఉన్న భవనాన్ని పరిశీలించాలని ఆర్డీవోను ఆదేశించారు. పెద్దమైన వాని లంక గ్రామస్తులలో అర్హులైన 78 మంది లబ్ధిదారులను ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద రిజిస్టర్ చేసి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని హౌసింగ్ పీడీని ఆదేశించారు. బ్రాకిష్ వాటర్ ఆక్వా సాగుదారులు సిఎఎ రిజిస్ట్రేషన్లు వెంటనే పూర్తి చేసుకునేలా ప్రభుత్వం ట్రక్ షీట్ ను ఏర్పాటు చేసిందని, రిజిస్ట్రేషన్ లు చేయుటకు శిక్షణ పొందిన యువత దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పీఎం లంక పర్యటన ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో మార్గం మధ్యలో తూర్పుతాళ్ల లక్కవరం వద్ద కొంతమంది గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కారుని ఆపి త్రాగునీటి పైపులో వర్షపు నీరు కలిసి వస్తున్నదని ఈ సమస్యను పరిష్కరించాలని కోరడంతో, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి రెండు రోజుల లోపుగా సమస్యను పరిష్కరించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారిని ఆదేశించారు.

ఈ సందర్భంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండి అండ్ సీఈవో గుమ్మాల గణేష్ కుమార్, నరసాపురం ఆర్డీవో దాసిరాజు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ లోకమాన్, జిల్లా గృహనిర్మాణ శాఖ అధికారి జి.పిచ్చయ్య, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పిఆర్ఓ పి.మోహనరావు, తహసిల్దార్ ఎన్ఎస్ఎస్వీ ప్రసాద్, తదితరులు ఉన్నారు.