ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కొరకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి అధికారులకు ఆదేశాలు-జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
జున్నూరు కృష్ణ రైస్ మిల్, రైతు సేవా కేంద్రం ఆకస్మిక తనిఖీ…
గురువారం పోడూరు మండలంలోని జున్నూరులో కృష్ణ రైస్ మిల్లును, రైతు సేవ కేంద్రంను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లులో గోనె సంచులు నాణ్యతను పరిశీలించారు. ఖరీఫ్ సీజన్ 2025-26 రైతులు నుండి కొనుగోలు చేసే ధాన్యం కొనుగోలు రైస్ మిల్లర్స్ సప్లై చేసే గోనె సంచులు డామేజీలు లేకుండా నాణ్యతతో ఉండాలన్నారు. రైతు సేవా కేంద్రాలకు గోనె సంచులు పంపేందుకు సిద్ధం చేయాలని రైస్ మిల్లర్స్ ప్రతినిధులు ఆదేశించారు.
ఈ సందర్భంగా జున్నూరు రైతు సేవ కేంద్రం ను సందర్శించారు అగ్రికల్చర్ సిబ్బందికి, వి ఏ లు కు పలు సూచనలు జారీ చేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు సంబంధించిన సమాచార వివరాలను డిస్ప్లే బోర్డుల ద్వారా ప్రదర్శించాలన్నారు. తేమ శాతం తెలిపే మీటర్లను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ఏర్పాట్లకు పటిష్ట ఏర్పాటు చేయాలని అన్నారు. ప్యాడి, ఆక్వాకల్చర్, హార్టికల్చర్, బంజర భూములు, ఈ క్రాఫ్ట్ ఎలా నమోదు చేయాలి తదితర వివరాలను విఏ లకు అగ్రికల్చర్ సిబ్బందికి జాయింట్ కలెక్టర్ వివరించారు. అనంతరం పోడూరు తహసిల్దార్ కార్యాలయంను సందర్శించారు. మండలంలోని పి జి ఆర్ ఎస్ పిటీషన్లు పరిష్కారం పై . తహసిల్దార్, వీఆర్వోలతో సమీక్షించారు. పి జి ఆర్ ఎస్ పిటీషన్లు పరిష్కరించడంలో తీసుకునే చర్యలు పై దిశ నిర్దేశములను చేశారు. ఫిర్యాదుదారునితో స్వయంగా మాట్లాడి క్వాలిటీతో పరిష్కార చర్యలు. తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంలో తహసిల్దార్, ఎం.ఎస్ పాజిల్, మండల వ్యవసాయ శాఖ అధికారి విశ్వేశ్వరరావు, ఆరెఆర్ఐ, వీఆర్వోలు, తదితరులు ఉన్నారు.