Close

స్వచ్ఛోత్సవ్ 2025 వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా జాయింట్ కలెక్టర్ పి రాహుల్ కుమార్ రెడ్డి.

Publish Date : 17/09/2025

బుధవారం స్థానిక కలెక్టరేట్ జిల్లా జాయింట్ కలెక్టర్ చాంబర్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, 2025, స్వచ్ఛోత్సవ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛ భారత్ మిషన్ – ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారని ఆయన అన్నారు. విశాలమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల భాగస్వామ్యం కల్పించడం, మురికిగా, కష్టంగా ఉన్న చెత్త ప్రదేశాలను శుభ్రం చేయడం, శానిటేషన్ వర్కర్ల ఆరోగ్యం మరియు సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకోవడం, సామాజిక వేడుకలను పర్యావరణ హితంగా జరుపుకోవడం బంటి లక్ష్యాలతో కూడిన ఐదు స్తంభాలు 1.శుభ్రత లక్ష్య యూనిట్ల (CTUs) రూపాంతరం 2. ప్రజా ప్రదేశాల శుభ్రత,3. సఫల్మీనా సురక్షా శిబిర్, 4.శుభ్రమైన పచ్చని వేడుకలు, 5. స్వచ్ఛతపై అవగాహన పాటిస్తూ ప్రజల అవగాహన కల్పించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టీ రాహుల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి కే శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి ఎం రామ్నాథ్ రెడ్డి, డ్వామా పిడి డా. కె సి హెచ్ అప్పారావు, జిల్లా స్త్రీ శిశు సస్క్షేమ శాఖ అధికారి డి శ్రీ లక్ష్మి, మెప్మా పీడీ హెఫ్జిబా, పొల్యూషన్ కంట్రోల్ ఏఈ ఎస్ .రమేష్, తదితరులు పాల్గొన్నారు.