ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయండి అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
త్వరలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
ఆదివారం స్థానిక ఆర్డిఓ కార్యాలయం ఛాంబర్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఖరీఫ్ సీజన్ 2025-26 సంబంధించి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై రెవిన్యూ, వ్యవసాయ, సహకార శాఖ అధికారులు, మరియు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో ధాన్యం సేకరణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుకు కావలసిన గన్ని బ్యాగులు ఆర్ ఎస్ కే సిబ్బంది, ధాన్యం రవాణా చేసే వాహనములు సిద్ధము చేయాలని అన్నారు. ఇప్పటివరకు మండలంలో ఎన్ని ఎకరాలు వరి కోతలు జరిగాయి పొక్యూర్ మెంట్ ఏ విధంగా జరుగుతుంది అని అధికారులని అడిగి తెలుసుకున్నారు. 80 ఎకరముల వరకు వరి కోతలు జరిగినట్లు జాయింట్ కలెక్టర్ టిmరాహుల్ కుమార్ రెడ్డి కి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మండలంలోని కడియద్ధం గ్రామములో రైతు సేవ కేంద్రమును జాయింట్ కలెక్టర్ సందర్శించారు. తేమశాతం తెలిపే యంత్రమును పరిశీలించారు. అనంతరం గ్రామంలోని క్షేత్రస్థాయిలో వరి కోతలను ధాన్యం రాశులను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. త్వరలో ధాన్యం కొనుగోలు కేంద్రములను ఏర్పాటు చేయనున్నామని ధాన్యమును నిర్ణీత తేమశాతం వచ్చేవరకు ఆరబెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యమును అమ్ముకుని ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర పొందాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి రైతులకు సూచించారు.
ఈ సందర్భంలో ఆర్డీవో ఖతీబ్ కౌసర్ భానో, తాహసిల్దార్ ఎం.సునీల్ కుమార్, మండల వ్యవసాయ శాఖ అధికారి బి.నారాయణరావు, సహకార శాఖ ఎంఎల్వోలు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు, రైతులు, తదితరులు ఉన్నారు.