స్త్రీల ఆరోగ్య పరిరక్షణకు జిల్లాలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
శనివారం కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వస్థ నారి శసక్త పరివార్ అభియాన్ కార్యక్రమంపై (ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబం) సంబంధిత అధికారులతో కన్వర్జెన్సీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ స్వస్థ నారి శసక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్త్రీల ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన, పరీక్షలు, చికిత్సలు ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను ఈనెల ఈనెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలుపరచుటకు చర్యలు తీసుకోవాలని డి ఎం అండ్ హెచ్ ఓను ఆదేశించారు. సామాజిక, పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలు, జిల్లా మరియు వైద్య కళాశాల ఆసుపత్రులు అధ్వర్యంలో ప్రత్యేక వైద్య నిపుణులు సహకారంతో మహిళలు మరియు పిల్లల కేంద్రీకృత ఆరోగ్య శిబిరాలు నిర్వహణ, స్క్రీనింగ్, అవహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. క్యాన్సర్ స్క్రీనింగ్, ప్రసూతి సంరక్షణ, తల్లి, పిల్లల రక్షణ, ఇమ్యునైజేషన్, రక్తహీనత స్క్రీనింగ్ రక్తదానం, టి.బి స్క్రీనింగ్, అధిక రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఆనారోగ్య మహిళలకు క్షయవ్యాధి స్క్రీనింగ్, కౌమారదశలో ఉన్న బాలికలు, మహిళలకు రక్తహీనత స్క్రీనింగ్, కౌన్సెలింగ్ సేవలు, పిల్లలకు రోగనిరోధక సేవలు అందించబడతాయన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, స్త్రీ శిశు సంక్షేమ సాంఘిక సంక్షేమ శాఖ, డిఆర్డిఏ, విద్యాశాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పిహెచ్సి కేంద్రాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ హెల్త్ క్యాంపులకు వచ్చే మహిళలను ఆదరణగా రిసీవ్ చేసుకోవాలని వారికి మంచి పోషకాహారం, అల్పాహారం అందించాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ జి.గీతాబాయి, డి సి హెచ్ ఎస్ పి.సూర్యనారాయణ, డి ఆర్ డి ఏ పిడి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, ఐసిడిఎస్ పిడి డి.శ్రీలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.