Close

కౌశలం సర్వే, పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్, వాట్సాప్ గవర్నెన్స్, ఈపిటిఎస్ ఫైల్స్ అప్లోడింగ్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 10/09/2025

జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టండి.

కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం వర్క్ ఫ్రం హోం, ఈ కేవైసీ, వాహనాల ఆధార్ సీడింగ్, తల్లికి వందనం, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ తల్లికి వందనం పథకంలో భాగంగా తల్లుల బ్యాంకు ఖాతాలో ఇంకను కొంతమందికి వివిధ కారణాల దృష్ట్యా నగదు జమకాకపోవడంపై ఉన్న సమస్యలను సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. 5 నుండి 7 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మరియు 15 నుండి 18 సంవత్సరాల వయసు మధ్య గలిగిన పిల్లలందరికీ ఆధార్ బయోమెట్రిక్ ను అప్డేట్ చేయాలని సూచించారు. కౌశలం సర్వే త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వాహన పోర్టల్ లో ఉన్న అన్ని రకాల వాహనాలకు ఆధార్ సీడింగ్ పూర్తి చేయాలని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర యాప్ ద్వారా పౌరులకు అందే సేవలపై విస్తృతమైన ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు.జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రస్థాయి ఐ.వి.ఆర్.ఎస్ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రభుత్వ పథకాలు అమలు ద్వారా సాధించిన ప్రగతిలో మన జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో గ్రామ, వార్డు సచివాలయ అధికారి వై.దోసి రెడ్డి, జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.