మేదర బుట్ట పట్టుకుని చెత్త సేకరిస్తున్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి(IAS)
అంతర్జాతీయ తీరప్రాంతం శుభ్రపరిచే దినోత్సవాన్ని పురస్కరించుకొని పశ్చిమగోదావరిజిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ నందు క్లీనింగ్ క్యాంపెయిన్ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, డ్వాక్రా మెప్మా మహిళలు, తదితరులు కలిసి బీచ్ క్లీనింగ్ నందు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పాల్గొని అందర్నీ ఉత్సాహపరిచారు. నరసాపురం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్, బొమ్మిడి నాయకర్. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారులు విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు చేయి చేయి కలిపి గోనె సంచులు మేదర బుట్టలలోనికి చెత్తను సేకరించి ట్రాక్టర్లో డంపు చేయడం విద్యార్థులకు పర్యావరణం పట్ల స్ఫూర్తిదాయకంగా నిలిచింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ చిన్ననాటి నుండే విద్యార్థులకు పర్యావరణం పట్ల అవగాహన కల్పించడం ద్వారా కాలుష్య నియంత్రణకు ముందడుగు వేయడమే అన్నారు. క్లీనింగ్ కార్యక్రమం ఒక్క రోజుతో పరిమితం కాకుండా ప్రతిరోజు నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.