• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

తాడేపల్లిగూడెం బ్రహ్మానంద రెడ్డి హోల్ సేల్ మార్కెట్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 30/08/2025

శనివారం తాడేపల్లిగూడెం బ్రహ్మానంద రెడ్డి హోల్ సేల్ మార్కెట్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కర్నూలు నుండి వచ్చిన ఉల్లి పాయలను పరిశీలించారు. కర్నూలులో రైతులు పండిస్తున్న ఉల్లిపాయకు కనీసం మద్దతు ధర రాకపోవడంతో మద్దతు ధర కల్పించాలని రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మన జిల్లాలో తాడేపల్లిగూడెం బ్రహ్మానందం రెడ్డి హోల్ సేల్ మార్కెట్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించి వ్యాపారస్తులు, రైతులతో మాట్లాడారు. కర్నూలు నుండి వచ్చిన ఉల్లిపాయలకు ఎందు కారణంగా ధర తక్కువగా ఉంది, రైతులకు ఎందుకు గిట్టుబాటు ధర రావడం లేదు అని పలు విషయాలను వ్యాపారస్తులను, రైతులను జాయింట్ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన ఉల్లిపాయలు తడిచి పాడవడం వలన ఉల్లి ధర భారీగా తగ్గటము జరిగినదని కర్నూలు నుండి ఇక్కడికి తీసుకు వచ్చేసరికి ఉల్లిపాయలు పాడైపోతున్నాయని అందు వలన ఉల్లిపాయలను ఎవరూ కొనుగోలు చేయడం లేదని వివరించారు. కర్నూలు ఉల్లి రైతులకు కనీస మద్దతు ధర వచ్చేలా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. అలాగే కర్నూలు నుండి వచ్చిన ఉల్లిపాయలను రైతు బజార్లో అమ్మే విధంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

బాదంపూడి మార్కెట్ యార్డ్ చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా సందర్శించిన జాయింట్ కలెక్టర్

తాడేపల్లిగూడెం మండలం బాదంపూడి మార్కెట్ యార్డ్ చెక్ పోస్ట్ ను జాయింట్ కలెక్టర్ టి .రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. చెక్ పోస్ట్ కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. ప్రతిరోజు కర్నూలు నుండి ఎన్ని వాహనములు వస్తుంటాయి, ఎంత సరుకు వస్తుంది అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు కర్నూలు నుండి వచ్చే ఉల్లి వాహనములు అన్నియు కూడా మూమెంట్ రిజిస్టర్ లో నమోదు చేయాలని బాదంపూడి మార్కెట్ యార్డ్ చెక్ పోస్ట్ సూపర్వైజర్ ను ఆదేశించారు. కర్నూలు ఉల్లి పంట రైతులుకు నష్టం రాకుండా కనీస మద్దతు ధర వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

ఆయన వెంట ఆర్డిఓ కతీఫ్ కౌశల్ భానో, మార్కెటింగ్ డిప్యూటీ డైరెక్టర్ పి.పాపారావు, జిల్లా మార్కెటింగ్ ఏడి కె.సునీల్ కుమార్, తహసిల్దార్ ఎం.సునీల్ కుమార్, బ్రహ్మానంద రెడ్డి రైతు మార్కెట్ సెక్రటరీ గౌతు భాషా, బాదంపూడి చెక్ పోస్ట్ సూపర్వైజర్ కిషోర్, ఉల్లి రైతులు, వ్యాపారస్తులు, తదితరులు ఉన్నారు.

1.11