Close

జిల్లాలో తల్లికి వందనం పెండింగ్ క్లెయిమ్ లను పరిష్కారానికి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

Publish Date : 25/08/2025

సోమవారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వాహనాల ఆధార్ సీడింగ్, తల్లికి వందనం, వర్క్ ఫ్రం హోం, ఈ కేవైసీ, కౌశలం డాష్ బోర్డు తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ తల్లికి వందనం ఖాతాలో నగదు జమ చేయడానికి ఇబ్బందిగా ఉన్న అంశాల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ఐదు నుండి ఏడు సంవత్సరాల మధ్య వయసు కలిగిన మరియు 15 నుండి 18 సంవత్సరాల వయసు మధ్య గలిగిన పిల్లలందరికీ ఆధార్ బయోమెట్రిక్ ను అప్డేట్ చేయాలని సూచించారు. వర్కు ఫ్రొం హోమ్ లో భాగంగా సాంకేతిక విద్యను అభ్యసించిన నిరుద్యోగ యువతను గుర్తించి డేటాను కౌశలం డాష్ బోర్డులో అప్డేట్ చేయాలని సూచించారు. రిజిస్టర్ అయ్యి వాహన పోర్టల్ లో ఉన్న అన్ని రకాల వాహనాలకు ఆధార్ సీడింగ్ పూర్తి చేయాలని తెలిపారు. మండలాల వారీగా పెండింగ్ ఉన్న ఇ-సర్వీస్ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేయించాలని డిజిటల్ అసిస్టెంట్లకు సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో గ్రామ వార్డు సచివాలయాలు అధికారి వై. దోసి రెడ్డి, డ్వామా పి.డి డాక్టర్ కే సిహెచ్ అప్పారావు, జిల్లా మత్స్యశాఖ అధికారి నాగలింగ చార్యులు, సిపిఓ కార్యాలయం స్టాటిస్టికల్ అధికారి, తదితరులు పాల్గొన్నారు.