భారీ వర్షాలు కారణంగా నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అత్తిలి మండలం తిరుపతిపురం, వరిగేడు ప్రాంతాల్లో నీట మునిగిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వర్షం లేనందున నీరు తొలగితే పంటకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు అని తెలిపారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లా సగటు వర్షపాతం 90 మిల్లీమీటర్ల కాగా బుధవారం ఒక్క రోజునే 1799.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగిందని, దీని కారణంగా లోతట్టు ప్రాంతాల్లోనీ సుమారు 400 నుండి 500 ఎకరాల వరకు పంట పొలాలు నీటి ముంపుకు గురయ్యాయి అన్నారు. ప్రస్తుతం వర్షం ఆగినందున నీరు తొలగిపోతే పంట దెబ్బ తిన్నదిలేనిది వ్యవసాయ అధికారులు పరిశీలించి నష్టం వివరాలను నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.
పంట పొలాలు పరిశీలన సందర్భంలో అత్తిలి తహసిల్దార్ దశిక వంశీ, స్థానిక ఎంపీపీ పోలిశెట్టి చందు, స్థానిక రైతులు, రెవిన్యూ, వ్యవసాయ శాఖ సిబ్బంది, తదితరులు ఉన్నారు.