• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేలా విద్యాధికారులు, ఉపాధ్యాయులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Publish Date : 23/07/2025

బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలోని పాఠశాలల విద్యా ప్రమాణాలపై సంబంధిత విద్యాశాఖ అధికారులు, టీచర్స్ యూనియన్ల ప్రతినిధులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉన్నారని, పిల్లలకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలని సూచించారు. ప్రస్తుతం అందించిన స్టడీ మెటీరియల్ తాను కూడా చూశానని చాలా బాగుందని, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు ప్రస్తుత కాలానికి అనుగుణంగా నైపుణ్యాన్ని పెంచుకుంటూ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు వివిధ సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులను సబ్జెక్టుల వారిగా విభజించి ఆగస్టు 15 వరకు “సంసిద్ధత కార్యక్రమం” పేరిట ఉదయం, సాయంత్రం ఒక గంట అదనంగా తరగతులు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చేరికలు తక్కువగా ఉన్నాయని, విద్యార్థుల సంఖ్య పెంచడానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆయా పాఠ్యాంశాల నందు నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని మీరు, మేము వారి వద్ద చదువుకునే నేడు ప్రయోజకులుగా ఉన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. అదే స్ఫూర్తితో మీరు కూడా ఆరోగ్యవంతమైన విద్యా సమాజాన్ని రూపొందించడంలో భాగస్వామ్యులు కావాలని, పిల్లలకు మంచి భవిష్యత్తుని అందించాలని సూచించారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా నిర్వహించిన “పరాక్” సర్వే ఫలితాల్లో పశ్చిమగోదావరి జిల్లా అన్ని పారామీటర్స్ లో వెనుకబడి ఉండడాన్ని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను, యూనియన్ నాయకులను ప్రశ్నించారు. విద్య ప్రమాణాలు పెంపుకు వివిధ యూనియన్లు, విద్యాశాఖ అధికారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. సమావేశం దృష్టికి తీసుకువచ్చిన ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, ఏ పి సి శ్యాంసుందర్, ఏ.డి సత్యనారాయణ, భీమవరం డిప్యూటీ డిఇఓ ఎన్.రమేష్, నరసాపురం డిప్యూటీ డిఈఓ మురళి సత్యనారాయణ, మండల విద్యాశాఖ అధికారులు, వివిధ ఉపాధ్యాయులు సంఘాలు అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.