Close

భీమవరం కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ వద్ద అన్న క్యాంటిన్లు సందర్శన-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Publish Date : 23/07/2025

అందిస్తున్న ఆహార పదార్థాలపై ఆరా..

అన్న క్యాంటీన్ల ప్రాంగణం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి…

40 మంది పేదవారికి వస్త్రాలు పంపిణీ

అన్న క్యాంటీన్ ద్వారా అందించే ఆహార పదార్థాలు శుభ్రంగా, వేడిగా, రుచిక అందించాలని, ప్రభుత్వ లక్ష్యం మేరకు అన్న క్యాంటీన్లను చిత్తశుద్ధితో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ ల వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంలో మధ్యాహ్న భోజనం చేస్తున్నవారితో మాట్లాడారు. ఆహార పదార్థాలు రుచికరంగా ఉంటున్నాయా, అన్న క్యాంటీన్లు పరిశుభ్రంగా ఉంటున్నాయా, భోజనం చేయడానికి ఏదైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని ప్రశ్నించి, స్వయంగా జిల్లా కలెక్టర్ ఆహార పదార్థాలను రుచి చూశారు. అనంతరం 40 మంది పేదవారికి ఆడవారికి చీరలు, మగవారికి దుప్పట్లు, లుంగీలు, టవల్స్, టూత్ పేస్టులు తదితర వస్తువుల కిట్లును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకొని అన్న క్యాంటీన్లను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వివిధ పనులు చేసుకుంటూ నివసిస్తున్న పేద వర్గాలు, వివిధ పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చే వారి కోసం తక్కువ ఖర్చుతో అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలను అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష్యంతో అన్న క్యాంటీన్ల ఏర్పాటుచేసి ఎంతోమంది ఆకలిని తీర్చే కల్పతరువులా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం మేరకు నిర్వాహకులు పరిశుభ్రమైన వాతావరణంలో అన్న క్యాంటీన్లను నిర్వహించాలని ఆదేశించారు. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ నడుస్తున్నందున దోమలు, ఈగలు అధికంగా చేరే అవకాశం ఉందని, ఆహార పదార్థాలపై ఎప్పటికప్పుడు మూతలతో కప్పి ఉంచాలన్నారు. అన్న క్యాంటీన్ల లోపల, బయట పరిశుభ్రంగా ఉంచడంతోపాటు, వాష్ ఏరియాని కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని ఆదేశించారు.

అన్న క్యాంటీన్లను పరిశీలిస్తున్న సందర్భంలో మున్సిపల్ డిఈ రెహమాన్, ఎంహెచ్ఓ సోమశేఖర్, వార్డు సచివాలయం ఎమ్యూనిటీ కార్యదర్శి మోహన్ రావు, మహిళా పోలీస్ పుష్ప రాణి, తదితరులు ఉన్నారు.