విద్యార్థులకు వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించాలి-జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
మెనూ ప్రకారం వంటలను రుచికరంగా చేయాలి
ప్రభుత్వ బాలికల వసతి గృహం ఆకస్మిక తనిఖీ
జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
భీమవరం మండలంలోని దిరుసుమర్రు గ్రామంలో మూడవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు నిర్వహిస్తున్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహమును సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడారు వసతి గృహంలో వారికి అందుతున్న సేవల గురించి ఆడిగి తెలుసుకున్నారు. మీకు హాస్టల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అడిగి తెలుసుకున్నారు. మీరు ఎక్కడ నుండి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. మీ తల్లిదండ్రులు ఏమి పని చేస్తారు, భోజన వసతి ఎలా ఉంది ప్రతిరోజు సన్న బియ్యంతో తయారుచేసిన రైసును మెనూ ప్రకారం కూరలు పెడుతున్నారా అని ఆరా తీశారు. విద్యార్థినులు భోజన వసతి బాగుంటుంది సౌకర్యాలు బాగున్నాయని బదులిచ్చారు. పిల్లలు పడుకుంటున్న గదులను పరిసరాలను పరిశీలించారు. వంట షెడ్డులో తయారుచేసిన వంటను కూరలను స్వయంగా పరిశీలించారు. వర్షము వచ్చినప్పుడు హాస్టల్ గేటు వద్ద పల్లముగా ఉండటం వల్ల వర్షం నీరు నిలిచి లోపలికి రావటానికి ఇబ్బంది కరంగా ఉందని, అలాగే కరెంటు పోతే చదువుకోడానికి ఇబ్బందికరంగా ఉంటుంది ఇన్వెంటర్ ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ ను విద్యార్థులు కోరారు. డోనార్స్ చేత ఏర్పాటు చేయిస్తానని అన్నారు. విద్యార్థులు అందరూ బాగా చదువుకుని మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఆహార పదార్థాలను తనిఖీ చేసిన ఆయన పిల్లలకు పెట్టే భోజనములో ఎటువంటి అవకతవకలు జరిగిన సహించేది లేదని ప్రతిరోజు మెనూ ప్రకారం వంటలను శుభ్రముగా చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి హాస్టల్ వార్డెన్ సిబ్బందిని ఆదేశించారు.
ఈ ఆకస్మిక తనిఖీలో సందర్భంలో తాహసిల్దార్ రావి రాంబాబు, హాస్టల్ వార్డెన్ ఏ.దేవి, వీఆర్వో తదితరులు ఉన్నారు.