Close

రాబోయే రబి కాలంలో కెఎన్ఎం 12368 సన్నని ధాన్యం రకం పండించడానిక రైతులను ప్రోత్సహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

Publish Date : 21/07/2025

భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో కెఎన్ఎం 12368 అనే సన్నని ధాన్యం వరినాట్లు వేసిన పొలాన్ని సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆ రకం యొక్క గుణగణాల్ని, మార్కెట్ విధానంపై పలు సూచనలు చేశారు. వ్యవసాయ అధికారులతో రైస్ మిల్లర్లను అనుసంధానం చేసి ఈ రకం ఓపెన్ మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువ అమ్ముడు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కెఎన్ఎం 12368 రకం రాబోయే రబి కాలంలో కూడా పండించడానికి అనుకూలమైనదని, జిల్లాలో వరి పండించే విస్తీర్ణంలో కనీసం 25 శాతం విస్తీర్ణంలో ఇటువంటి సన్నరకం పండించే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఇదే గ్రామంలో మరో ఇద్దరు రైతులు 60 ఎకరాలు విస్తీర్ణంలో సాగు చేయడం గమనించి ఆ రైతులతొ నేరుగా మాట్లాడారు. ఈ రకం కనీసం ఎకరాకు 35 బస్తాలు దిగుబడి వస్తుందని, ఈ విత్తనాన్ని ప్రకాశం జిల్లా దర్శి రైతుల నుండి సేకరించుకున్నామని జాయింట్ కలెక్టర్ కు కలెక్టర్ కు సదరు రైతు తెలిపారు.

. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి పసల బీమా యోజన పథకంలో తప్పక నమోదు చేయించుకోవాలని రైతులకు సూచించారు. గ్రామ వ్యవసాయ సహాయకులు, సొసైటీ సెక్రటరీలు తప్పనిసరిగా రైతులందరిని ఈ పథకంలో నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు ఈ పథకం ఆగస్టు 15వ తేదీలోగా ముగుస్తుందని కావున త్వరతిగతన నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జడ్.వెంకటేశ్వరరావు, జిల్లా కోపరేటివ్ అధికారి మురళీకృష్ణ, మండల వ్యవసాయ శాఖ అధికారి వైవిఎస్ ప్రసాద్, తహసిల్దార్ ఆర్.రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.