ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చు-జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి.
ఏ.ఐ టెక్నాలజీని ఉపయోగించుకోవాలి.
పశ్చిమగోదావరి జిల్లా పరిపాలన యంత్రాంగం ఆధ్వర్యంలో ఎస్సి, ఎస్టి, బీసీ, ఒబిసి, ఇబిసి ధ్రువ పత్రాల జారీ, ప్రభుత్వ భూమి ఆక్రమణల తొలగింపు తదితర అంశాలపై శనివారం ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన రెవెన్యూ ఉద్యోగుల శిక్షణ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖలలో రెవెన్యూ శాఖ ఎంతో కీలకమైనదని, ఈ శాఖ ద్వారానే ముఖ్యమైన పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కావున రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు చట్టాలు, వాటిలోని నిబంధనలు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. అప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతారన్నారు. ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు వల్ల రెవిన్యూ ఉద్యోగులు తమ పనితీరు మెరుగుపరచుకోవడానికి అవసరమైన నైపుణ్యం పెంచుకోవచ్చు అన్నారు. ఎంత నేర్చుకున్నా, కాలానుగుణంగా వచ్చే సాంకేతికను అందిపుచ్చు కోవడానికి ప్రతి ఒక్కరికి శిక్షణ చాలా అవసరమన్నారు. వివిధ అంశాలపై ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు మరిన్ని నిర్వహించడం జరుగుతుందని రెవెన్యూ అధికారులు, సిబ్బంది అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ తమ నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు. ఈ సందర్భంలో పనిలో ఉపయోగపడే ఏఐ టెక్నాలజీ సంబంధించిన వివిధ టూల్స్ ను ఏ విధంగా ఉపయోగించుకోవాలో రెవెన్యూ అధికారులకు, ఉద్యోగులకు జాయింట్ కలెక్టర్ వివరించారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి పాలకొల్లు తహసిల్దార్ వై.దుర్గా కిషోర్ రెవెన్యూ చట్టాలు, నిబంధనలు, వివిధ కులాలకు ధ్రువపత్రాలు జారీలో తీసుకోవలసిన జాగ్రత్తలు తదితర విషయాలపై రెవిన్యూ అధికారులకు, ఉద్యోగులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు కె. ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఖతిబ్ కౌసర్ భానో, దాసిరాజు, డివిజనల్ అధికారులు, తహసిల్దార్లు, డిప్యూటీ తహసిల్దారులు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, వీఆర్వోలు, వివిధ శాఖల శాఖల సిబ్బంది పాల్గొన్నారు.