Close

ఎంజాయ్ మెంట్ సర్వే భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 18/07/2025

మొగల్తూరు మండలంలోని కాళీపట్నం రెవిన్యూ గ్రామ పరిధిలో పాతపాడు, జగన్నాధపురం, కాళీపట్నం తూర్పు, కాళీపట్నం పడమర, కొత్తోట గ్రామాల సెటిల్మెంట్ భూములు సంబంధించి శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఎంజాయిమెంట్ సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ భూములకు సంబంధించిన మ్యాప్ లను పరిశీలించి, వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జగన్నాధపురం సచివాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. రికార్డులన్నీ ఏటువంటి పొరపాట్లు లేకుండా కచ్చితంగా ఉండాలన్నారు.
ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. గ్రామ కంఠం భూములకు సంబంధించిన అడంగల్ లో నమోదు చేసిన ఇళ్లకు సంబంధించి క్రయం విక్రయాలు రిజిస్ట్రేషన్ ను వెసులుబాటు కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ను రైతులు కోరారు. ఈ విషయంపై జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ కంఠం భూములు సర్వే చేయించిన అనంతరం తగు చర్యలు తీసుకుంటామని రైతులతో అన్నారు.

ఈ సందర్భంలో జాయింట్ కలెక్టర్ వెంట నరసాపురం ఆర్డీవో దాసిరాజు, తాహసిల్దార్ రాజ్ కిషోర్, జిల్లా కలెక్టరేట్ ల్యాండ్ సూపరింటెండెంట్ సి.హెచ్ రవికుమార్, మండల ల్యాండ్ సర్వేయర్ ఎ.ధనరాజ్, డిటి జి.కళ్యాణి, వీఆర్వోలు గ్రామ సర్వేలు తదితరులు ఉన్నారు.