వర్షాకాలం సీజన్ దృష్టిలో ఉంచుకొని అధిక వర్షాలు, వరదలు పట్ల అప్రమత్తంగా ఉండాలి..
శివారులోని ప్రతి ఎకరానికి సాగునీరు అందాలి…
జల వనరుల శాఖ అధికారులు నిరంతరాయంగా క్షేత్రస్థాయిలో నీటి సరఫరాను పర్యవేక్షించాలి…
విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవ్..
… జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
వరి సాగుకు అవసరమైన సాగునీటిని శివారు భూములకు సైతం ఆటంకం లేని విధంగా సరఫరాకు జల వనరుల శాఖ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పంట పొలాలతో సాగునీటి సరఫరాపై ఇరిగేషన్, డ్రైన్స్, ఎర్రకాలువ, గోదావరి హెడ్ వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాభావ పరిస్థితిల కారణంగా వరి సాగుకు నీటిఎద్దడి ఏర్పడకుండా శివారు భూములకు అవసరమైన నీటి సరఫరా జరిగేలా ఇరిగేషన్ ఇంజనీర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లి నిరంతరాయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. సాగునీటి ప్రవాహానికి ఆటంకం లేని విధంగా తూడు, గుర్రపు డెక్క, ప్లాస్టిక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులును చూసి నిర్లక్ష్యం వహించవద్దని, వర్షాకాలంలో రెండు, మూడు మాసాలు అధిక వర్షాలు, వరదలు ఏ సమయంలోనైనా సంభవించే అవకాశం ఉందని, దీనికి తగినట్టుగా అన్ని విధాల ఇంజనీరింగ్ అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. కాంట్రాక్టర్లతో మాట్లాడి ఎప్పటికప్పుడు తూడు, గుర్రపు డెక్క తొలగింపు పనులను చేపట్టాలన్నారు. పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు.
తొలుత ఇరిగేషన్ కెనాల్స్, డ్రైన్స్ సాగునీటిపారుదల సిస్టం మ్యాపులను పరిశీలించి అధికారులకు తను సూచన చేశారు.
ఈ సమావేశంలో జల వనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.సుబ్రహ్మణ్యేశ్వర రావు, హెడ్ వాటర్ వర్క్ ఈ.ఈ జి.శ్రీనివాస్, ఇరిగేషన్, డ్రైన్స్, ఎర్ర కాలువ, గోదావరి హెడ్ వాటర్ వర్క్స్ డిఇలు, ఏఈలు పాల్గొన్నారు.