జిల్లాలోని పరిశ్రమలు సోలార్ విద్యుత్ ఏర్పాటుకు ఆలోచన చేయాలని, తద్వారా విద్యుత్ భారాన్ని తగ్గించుకునేందుకు వీలవుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
శుక్రవారం తణుకు రూరల్ మండలం తేతలి రామభద్ర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇరగవరం మండలం కె.ఇల్లందలపర్రు వాన్బారీ మెట్ ఫార్మా తణుకు ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ ఇండస్ట్రీని సందర్శించారు. ఈ పరిశ్రమలను సందర్శించిన సందర్భంలో యాజమాన్యంతో మాట్లాడుతూ కార్మికుల రక్షణ కొరకు చేపట్టిన రక్షణ చర్యలపై ఆరా తీశారు. పరిశ్రమలకు నిర్దేశించిన రక్షణ చర్యలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. నిబంధనల మేరకు మాక్ డ్రిల్ ను నిర్వహించాలన్నారు. జిల్లాలో పరిశ్రమల నిర్వహణ ప్రమాద రహితంగా ఉండేందుకు అలసత్వం లేకుండా అన్ని చర్యలను చేపట్టాలన్నారు. పరిశ్రమలలో పనిచేస్తున్న సిబ్బంది స్థానికులా, ఇతర రాష్ట్రాల నుండి వచ్చినవారా, వేతనాలు ఏ విధంగా ఉంటాయి, ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా ఇఎస్ఐ., పి.ఎఫ్ అమలుచేస్తున్నారా, అవసరమైన టెక్నీషియన్స్ కొరత ఎమైనా వుందా అని ఆరా తీశారు.
ఆన్ సైట్ ప్లాన్ సమర్పించారాఅని జిల్లా పరిశ్రమ శాఖ అధికారులు అడిగి తెలుసుకున్నారు. జిల్లా నైపుణ్యాధి సంస్థ ద్వారా పరిశ్రమలకు అవసరమైన సిబ్బంది నియామకాలకు చర్యలు చేపట్టాల్సిందిగా తెలిపారు. అలాగే పరిశ్రమల నిర్వహణలో ఉన్న ఇబ్బందులను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా సమస్యలను పరిష్కరించాలని జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ఆదేశించారు.
తొలుత రామభద్ర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ను సందర్శించి స్పిన్నింగ్ మిల్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రా మెటీరియల్ ఎక్కడినుంచి వస్తుంది, ఏదైనా సబ్సిడీ ఉంటుందా అని ఆరా తీశారు. రామభద్ర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, టెటాలి విలేజ్‌లో ₹130 కోట్ల పెట్టుబడితో ఫేజ్-1 కింద అధునాతన వార్పింగ్ మరియు సైజింగ్ సిస్టమ్‌లతో అనుసంధానించబడిన 64 ఎయిర్-జెట్ లూమ్‌లతో కూడిన అత్యాధునిక నేత సౌకర్యాన్ని స్థాపించడం జరిగిందని యాజమాన్యం వివరించారు. ఈ పరిశ్రమలో 150 మంది సభ్యులకు ఉపాధిని అందిస్తున్నట్లు తెలిపారు. రామభద్ర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్‌లో తన రెండవ అతిపెద్ద బెడ్ లినెన్ తయారీ యూనిట్‌ను స్థాపించడం ద్వారా భారతదేశపు వస్త్ర రంగానికి నాయకత్వం వహించనున్నట్లు తెలిపారు. అధునాతన నేత సాంకేతికతను పూర్తిగా ఆటోమేటెడ్ బెడ్ షీట్ ఉత్పత్తి యూనిట్‌తో అనుసంధానించడం ద్వారా లగ్జరీ, స్థిరమైన గృహ వస్త్రాలకు – ముఖ్యంగా ప్రీమియం బెడ్ లినెన్లకు – పెరుగుతున్న ప్రపంచ డిమాండ్‌ను ఉపయోగించుకోవడానికి ఈ ప్రాజెక్ట్ రూపొందించబడిందన్నారు.
అనంతరం వాన్బారీ మెట్ ఫార్మా కంపెనీని సందర్శించారు. అన్ని విషయాల గురించి ప్లాంట్ హెడ్ ముత్యాల వి వి ఎస్ న్ మూర్తి వివరించారు. ఈ సందర్భములో కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్తులో పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వము తరుపునుంచి అన్ని సహాయసహకారాలు అందిస్తామని తెలియజేసారు. ఇటువంటి పరిశ్రమలు రాష్ట్ర మరియు జిల్లా అభివృద్ధికి
ఏంతగానో తోడ్పడతాయన్నారు.
అనంతరం తణుకు ఆంధ్ర షుగర్స్ ను సందర్శించి రాకెట్ ఫ్యూయల్ ఆర్డర్ ఎలా వచ్చింది, ఎలా తయారు చేస్తారు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.పాల్గొన్నారు. పరిశ్రమ ప్రాంగణంలో రాకెట్ ఇంధన పరిశ్రమలైన Uff 25 plant-I, HFPB 2005 50 UH 25 plant -Ⅱ 20w du సాంకేతిక అంశాలను పరిశీలించారు.
ఈ సందర్భంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు. మంగపతి రావు, ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరక్టరు ముళ్ళపూడి నరేంద్రనాథ్, రామభద్ర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పి.ఎస్.ఆర్.ఎల్ రాజు, వాన్బారీ మెట్ ఫార్మా కంపెనీ ప్లాంట్ హెడ్ ముత్యాల వి వి ఎస్ న్ మూర్తి, తదితరులు ఉన్నారు.